రాధే మాకు ముందస్తు బెయిల్ నో: అరెస్టు ఖాయం
ముంబై: వివాదాస్పద ఆధ్యాత్మిక దేవత (గాడ్ వూమెన్) రాధే మా అలియాస్ సుఖ్వీందర్ కౌర్ (50) పోలీసుల ముందు కచ్చితంగా హాజరు కావలసి ఉంది. ఆమెకు వేరే దారిలేదని, ఒక వేళ ఆమె రాకుంటే పోలీసులు అరెస్టు చేసి తీసుకొచ్చే అవకాశం ఉందని ఫిర్యాదు చేసిన మహిళ తరుపు న్యాయవాది కేఆర్ మెహతా అన్నారు.
ముంబైకి చెందిన నిక్కీ గుప్తా (32) అనే మహిళ రాధే మా రెచ్చగొట్టడం వలనే తన భర్త నకుల్, అత్తమామలు వరకట్నం తీసుకురావాలని వేదిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై లోని కండ్లివి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 7వ నిందితురాలిగా రాధే మా పేరు ఉంది.
రాధే మా ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని గురువారం ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యడానికి న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే న్యాయస్థానం జారీ చేసిన సమన్లను పోలీసులు రాధే మాకు ఇచ్చారు.

ఈనెల 14వ తేది శుక్రవారం కండ్లివి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని పోలీసు అధికారులు సూచించారు. ఒక్క రోజు ముందు రాధే మా కోర్టును ఎందుకు ఆశ్రయించారు అని నిక్కీ గుప్తా న్యాయవాది కేఆర్ మెహతా ప్రశ్నిస్తున్నారు.
అమె ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారని, తప్పు చెయ్యకపోతే పోలీసుల ముందు ఎందుకు హాజరుకావడానికి వెనకడుగు వేస్తున్నారు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం లోపు రాధే మా కచ్చితంగా కండ్లివి పోలీస్ స్టేషన్ లో హాజరు కావలసి ఉంది.
ఆమె పోలీసుల ముందు హాజరుకాకుండ తప్పించుకోవాలని ప్రయత్నించి పారిపోతే పోలీసులే రాధే మాను అరెస్టు చేసి తీసుకొస్తారని న్యాయవాది కేఆర్ మెహతా అంటున్నారు. పోలీసు అధికారులు శుక్రవారం ఉదయం కండ్లవి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. రాధే మాను విచారణ చెయ్యడానికి వేచి ఉన్నారు.












Click it and Unblock the Notifications