దారుణం: ఫేస్ బుక్ ద్వారా ట్రాప్, డ్రగ్స్, హిప్నటైజ్ చేసి సెక్స్

ఫేస్ బుక్ ను డ్రగ్స్ తో పాటు సెక్స్ అలవాటు చేయడానికి కొందరు ఉపయోగించుకొంటున్నారు. ఈ ఫేస్ బుక్ పేజీలో తమ పోన్ నెంబర్లను నమోదు చేస్తే చాలు ఈ గ్రూప్ లో చేరినట్టే. ఈ గ్యాంగ్ బారి నుండి తమ పిల్లలను కాపాడాల

ముంబై: ఫేస్ బుక్ ను డ్రగ్స్ తో పాటు సెక్స్ అలవాటు చేయడానికి కొందరు ఉపయోగించుకొంటున్నారు. ఈ ఫేస్ బుక్ పేజీలో తమ పోన్ నెంబర్లను నమోదు చేస్తే చాలు ఈ గ్రూప్ లో చేరినట్టే. ఈ గ్యాంగ్ బారి నుండి తమ పిల్లలను కాపాడాలని కోరుతున్నారు ముంబైవాసులు.

సోషల్ మీడియాను మంచి కోసం కంటే చెడుకోసం ఉపయోగించుకొంటోంది ముంబైకి చెందిన ఓ గ్యాంగ్. బహిరంగంగానే టీనేజీ యువతకు డ్రగ్స్, సెక్స్ అలవాటు చేయడానికి ప్రయత్నాలు చేయడం పట్ల ముంబైకి చెందిన పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు.

Mumbai cult, ‘a drugs and sex racket’, was a Facebook click away: Parents

ముంబైకి చెందిన సునీల్ కులకర్ణి అనే వ్యక్తి యువతను ఈ రాకెట్ లోకి లాగుతున్నాడు. కులకర్ణి తమ కుమార్తెలను కూడ ట్రాప్ చేశాడంటూ వీళ్ళతో పాటు మరో జంట కూడ కోర్టును ఆశ్రయించింది. ఇంత జరుగుతున్న పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కోర్టు మండిపడింది.

దీంతో కులకర్ణిని గురువారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఫేస్ బుక్ పేజీలో రెచ్చగొట్టే ఫోటోలు, లైంగికంగా ప్రేరేపించే మేసేజ్ లు ఉంటాయి. ఆ గ్రూప్ లో చేరిన వాళ్ళకు డ్రగ్స్ ఇచ్చి హిప్నటైజ్ చేసి కులకర్ణితోపాటు మరికొందరు సెక్స్ లో పాల్గొనేలా చేస్తున్నారు.

కులకర్ణి తనకు తానుగా డాక్టర్ గాను, సైక్రియాట్రిస్టుగా చెప్పుకొంటున్నాడు.ఈ గ్రూపులో చేరిన తర్వాత తమ కూతుళ్ళ ప్రవర్తన దారుణంగా మారిందని మలాడ్ దంపతులు చెప్పారు. చదువులను వదిలేశారని పోలీసులను ఆశ్రయించాలని తాము భావిస్తోంటే ఆత్మహాత్య చేసుకొంటామని బెదిరించారని తెలిపారు.

తాము వాళ్ళను తిడుతున్నామని గృహహింసకు పాల్పడుతున్నామంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు కూడ ఇచ్చారని వివరించారు.టీనేజ్ అమ్మాయిలను కులకర్ణి ఆకర్షించి వారి బుర్రలను మార్చేస్తున్నాడని తన నియంత్రణలో పెట్టుకొంటున్నాడని తల్లిదండ్రులు వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+