వైద్యం కోసం వస్తే : రోగిపై డాక్టర్ అత్యాచారం.. నాలుగేళ్లుగా అదే పని..!

ముంబై : వైద్యో నారాయణ హరీ అంటారు పెద్దలు. డాక్టర్లను దేవుడి తర్వాత దేవుడిలా చూస్తారు. అయితే కొందరు వైద్యులు మాత్రం వృత్తి ధర్మాన్ని బేఖాతరు చేస్తూ పాడు పనులకు పాల్పడుతున్నారు. ఆ క్రమంలో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం చూస్తే ఎవరికైనా ఒళ్లు మండుతుంది. చికిత్స నిమిత్తం తన దగ్గరకు వచ్చిన ఓ మహిళా పేషెంట్‌పై కన్నేశాడు ఓ డాక్టర్. అలా నాలుగేళ్లుగా ఆమెపై అత్యాచారం చేస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు. చివరకు పాపం పండి కటాకటాలు లెక్కిస్తున్నాడు. ముంబైలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది.

ముసలి డాక్టర్ ఎంత పని చేశాడంటే.. మహిళా పేషెంట్‌ను..!

ముసలి డాక్టర్ ఎంత పని చేశాడంటే.. మహిళా పేషెంట్‌ను..!

ముంబైలోని మేగ్వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో 58 సంవత్సరాల డాక్టర్ వంశీరాజ్ ద్వివేది ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. ఆ క్రమంలో 27 సంవత్సరాల ఓ యువతి తనకు ఫైల్స్ కావడంతో చికిత్స నిమిత్తం సదరు వైద్యుడిని సంప్రదించారు. అయితే చిన్న సర్జరీ చేయాల్సి ఉందంటూ ఆమెను నమ్మించాడు. ఇక ఆ సమయంలో తన వక్రబుద్ధి చూపించాడు డాక్టర్. సర్జరీ పేరుతో ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా కూడా వీడియో తీసి భద్రపరుచుకున్నాడు.

ఎప్పుడు రావాలంటే అప్పుడు రావాల్సిందే.. లేదంటే..!

ఎప్పుడు రావాలంటే అప్పుడు రావాల్సిందే.. లేదంటే..!

ఆమెను లోబర్చుకున్న సదరు వృద్ధ డాక్టర్ తరచుగా ఫోన్ చేస్తూ తనను కలవాలంటూ వేధించేవాడు. కాదు, కూడదంటే ఆ వీడియోను బయట పెడతానంటూ వార్నింగ్ ఇచ్చేవాడు. దాంతో సదరు యువతి చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో అతడికి లొంగిపోయింది. అలా చాలాసార్లు అతడికి దాసోహమైంది. 2015 నుంచి ఇప్పటివరకు నాలుగేళ్లుగా ఆ యువతిపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.

ఇటీవల ఆ యువతికి వివాహం.. భర్తకు దొరికిన ఆ వీడియో

ఇటీవల ఆ యువతికి వివాహం.. భర్తకు దొరికిన ఆ వీడియో

అదలావుంటే ఇటీవల ఆ యువతికి పెళ్లయింది. ఆ క్రమంలో అత్తగారింటికి వెళ్లిపోయిన ఆమె డాక్టర్ ఫోన్ చేసినప్పుడల్లా కట్ చేసేది. డాక్టర్ కాల్స్‌కు స్పందించక పోయేసరికి అతడికి కోపమొచ్చింది. తనను దూరంగా పెడుతోందని భావించి ఆమెపై మొదటిసారిగా రేప్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆ వీడియో కాస్తా ఆమె భర్త సెల్‌ఫోన్‌కు చేరింది.

భర్త నిలదీసి.. డాక్టర్‌పై కేసు నమోదు.. 17 వరకు రిమాండ్

భర్త నిలదీసి.. డాక్టర్‌పై కేసు నమోదు.. 17 వరకు రిమాండ్

ఆ వీడియోలో ఉన్నది తన భార్యేనని నిర్ధారించుకుని ఆమెను ప్రశ్నించాడు. దాంతో జరిగిన విషయమంతా పూసగుచ్చి భర్తకు వివరించడంతో ఆయన సదరు డాక్టర్‌పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్టులో హాజరుపరచగా ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+