వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాఫియా: మిల్క్ బేబి నేడు మిలియన్ డాలర్ బేబి

|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేసిన డ్రగ్స్ మాఫియా క్వీన్ లేడి డాన్ బేబి అలియాస్ శశికళ పట్నాకర్ అలియాస్ మ్యావ్ మ్యావ్ (54) ఆస్తుల వివరాలు తెలుసుకున్న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు షాక్ కు గురైనారు.

లేడి డాన్ బేబీ ఆస్తుల విలువ రూ. వందల కోట్లలో ఉందని గుర్తించారు. ముంబై నగరంతో పాటు పూణేలోని 22 ప్రాంతాలలో బేబికి ఆస్తులు ఉన్నాయని వివరాలు సేకరించారు. 30 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మహిళ నేడు వందల కోట్ల రూపాయల ఆస్తులకు యజమాని అయ్యింది.

1980లో బేబి ముంబై నగరంలో ఇంటింటికి తిరిగి పాలు విక్రయించేది. తరువాత వ్యాపారంలో పరిచయం ఉన్న వారి ద్వార మాఫియా ముఠా సభ్యులతో పరిచయం పెంచుకుంది. అప్పటి నుండి డ్రగ్స్ సరఫరా చెయ్యడం మొదలు పెట్టింది. డ్రగ్స్ సరఫరా చేసి వందల కోట్ల రూపాయాలు సంపాదించింది.

 Mumbai Drugs Mafia’s Queen Shashikala Million Dollar Baby

ఈ విధంగా ముంబైలోని శ్రీమంతులు ఉన్న ప్రాంతాలలో ఆరు లగ్జరీ అపార్ట్ మెంట్ లు, ముంబై నగరంలోనే విలాసవంతమైన ఖరీదైన రెండు ఇండ్లు, పూణెలో ఏకంగా 9 ఎకరాలలో ఒక గెస్ట్ హౌస్ కొనుగోలు చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అంతే కాకుండా ముంబై, పూణె నగరాలలో పలు చోట్ల ఆమె ఆస్తులు ఉన్నాయని పోలీసు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో గత ఏప్రిల్ నెలలో బేబిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈమెకు సహకరిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధర్మరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
From a milk vendor who earned a few hundred rupees a month in the 1980s, to the alleged queen of a flourishing drug empire.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X