లైవ్ లో మహిళా న్యాయవాది ఆత్మహత్య యత్నం.. కాపాడిన పోలీసులు
ముంబైలో ఓ మహిళా న్యాయవాది ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
ముంబయి: ముంబయిలో ఓ కాలేజీ విద్యార్థి ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ ఆత్మహత్య కు పాల్పడి నెల గడిచిందో లేదో తాజాగా ఓ మహిళ కూడా అలాగే చేయబోయింది. ఫేస్‌బుక్ లైవ్‌లో సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. అయితే ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రకు చెందిన ప్రియాంక జెథలాల్ మరు అనే న్యాయవాది లైవ్ స్ట్రీమ్‌లో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. సెవ్రీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం 18వ అంతస్థుకు ఎక్కిన ప్రియాంక.. ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ ఆన్ చేసింది. తాను అక్కడి నుంచి దూకబోతున్నానని లైవ్‌లో చెప్పింది.

అయితే ప్రియాంక భవనం ఎక్కుతుండగా చూసిన స్థానికులు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రియాంకను కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి.. కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గత నెలలో 23 ఏళ్ల కాలేజీ విద్యార్థి లైవ్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బంద్రా శివారులోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ 19వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications