వెనక నుండి అసభ్య ప్రవర్తన: చెప్పుతో కొట్టి, లాక్కొచ్చింది
ముంబై: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించబోయిన ఓ వ్యక్తిని ఓ యువతి చెప్పుతో కొట్టిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. అంతేకాదు, అతనిని పోలీసులకు కూడా పట్టించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతను మాదక ద్రవ్యాల బానిస అని తేలింది.
పశ్చిమ మలాద్‌కు చెందిన పాతికేళ్ల యువతి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తోంది. శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఆమె టీ తాగేందుకు పశ్చిమ గోరేగావ్ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఓ ముప్పై ఏళ్ల వ్యక్తి వెనుక నుండి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

వెనక్కి తిరిగి చూసిన ఆమె ఆగ్రహంతో అతని చెంప పైన ఒక్కటిచ్చింది. ఆమె చెప్పుతో అతనిని కొట్టింది. సహచరులతో కలిసి అతనిని లాక్కొచ్చి పోలీసులకు అప్పగించింది. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. మరో సాహస యువతిని చూసి తాను స్ఫూర్తి పొందినట్లు ఆమె తెలిపింది.












Click it and Unblock the Notifications