అమ్మతనానికి మచ్చ: పసికందును పబ్లిక్ టాయిలెట్‌లో పడేసింది

Subscribe to Oneindia Telugu

ముంబై: కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును మరుగుదొడ్డి(పబ్లిక్ టాయిలెట్‌)లో పడేసి ఆ తల్లి తన కర్కశాన్ని చాటుకుంది. ఆడపిల్లని పడేసిందో లేక తప్పు చేసిన ఫలితామో గానీ కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తల్లే ఆ చిన్నారిని అంతం చేయాలనుకుంది.

ఈ దారుణ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. సదరు మహిళ.. పుట్టిన కొద్ది గంటల్లోనే బిడ్డను మరుగుదొడ్డిలో పడేసి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఓ మహిళ అందులోకి వెళ్లగా మరుగుదొడ్డి రంధ్రంలోంచి పసిబిడ్డ ముఖం కనిపించడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

Mumbai: Heartless mother leaves newborn girl to die in public toilet

వెంటనే బయటకు తీసి తన కుటుంబ సభ్యులతో పాటు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ పసిపాపను ఆసుపత్రికి తరలించారు.

వైద్యుల చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం కుదుటపడగానే పోషణకు గాను వాత్సల్య ట్రస్టుకు అందజేస్తామని సీనియర్ పోలీసు అధికారి అజినాథ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆ బిడ్డ తల్లి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, a baby girl, hours after her birth, was left to die in a public toilet, allegedly by her mother in Mumbai's Kanjurmarg suburb, police said today.
Please Wait while comments are loading...