యువతి పట్ల అసభ్యం: నవాజుద్దీన్ సిద్ధిఖీపై కేసు
ముంబై: బాలీవుడ్ నటుడు, ‘మాంఝీ -ద మౌంటెన్ మ్యాన్' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖీపై వేధింపుల కేసు నమోదైంది. ఓ యువతిపై చేయి చేసుకోవడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించాడంటూ ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముంబైలోని యారీ రోడ్డులోని హౌసింగ్ సొసైటీలో నవాజ్ నివసిస్తున్నాడు. సొసైటీ కాంపౌండ్‌లో ఉన్న బైక్స్ పార్కింగ్ స్థలంలో కార్లు పార్క్ చేయవద్దంటూ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఇటీవల నవాజుద్దీన్‌కి నోటీసులు ఇచ్చారు. ఈ విషయమై నవాజ్‌కు.. మరో యువతికి మధ్య ఆదివారం వాగ్వాదం జరిగింది.

వాగ్వాదం తీవ్రంగా మారడంతో ఆగ్రహానికి గురైన నవాజుద్దీన్ సదరు యువతిపై చేయి చేసుకున్నాడు. ఈ మేరకు ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 354 కింద నవాజుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై నవాజ్ మాత్రం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.
కాగా, నవాజుద్దీన్ మేనేజర్ అనూప్ పాండే మాట్లాడుతూ.. ఎలాంటి దర్యాప్తు చేయకుండానే నవాజుద్దీన్‌పై తప్పుడు కేసు పెట్టారని, ఇద్దరి మధ్యా కేవలం వాగ్వాదం మాత్రమే జరిగిందని, నవాజ్ ఎవరిమీదా చేయి చేసుకోలేదని చెప్పారు.
-
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications