తల్లిదండ్రుల ఆవేదన: స్కూల్‌లో పిల్లాడి జుట్టు కత్తిరించారు

ముంబై: తమ కుమారుడిని స్కూల్లోని క్లాస్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి క్యాంపస్‌లోనే బార్బర్‌ను తెప్పించి హెయిర్ కంటింగ్ చేశి అవమానించారంటూ 16 ఏళ్ల విద్యార్ధి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది ఉపాధ్యాయులు ఉద్దేశపూర్వకంగానే తమ కుమారుడికి కావాలనే ఇలా చేయించారని ఆరోపించారు.

ఈ విషయమై ఆ విద్యార్థి తల్లిదండ్రులు మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎంఎస్ సీపీసీఆర్)కు ఫిర్యాదు చేశారు. దక్షిణ ముంబైలోని పెద్దార్ రోడ్డులో గల యాక్టివిటీ హైస్కూల్‌లో 10వ తరగతి చదవుతున్న 16 ఏళ్ల విద్యార్ధికి స్కూల్ యాజమాన్యం సెప్టెంబర్ 24న స్కూల్ ఆవరణలోనే జట్టును కత్తిరించింది.

Mumbai: Parents Upset as School Gives Their Son a Haircut

దీనిపై ఆ విద్యార్ధి తల్లిదండ్రులు పోలీసు విచారణ కోరుతూ ముంబై డివిజన్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను కూడా ఆశ్రయించారు. తమ కుమారుడు బోర్డు ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతూ ఇప్పటికే కాస్తంత ఒత్తడిలో ఉన్నాడని, దీనికి తోడు స్కూల్ యాజమాన్యం జట్టు కత్తిరించి అతడిని మానసిక ఒత్తిడికి గురి చేసిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాదు సెప్టెంబర్ 20న తమ కుమారుడికి జట్టు కత్తిరించామని, అయినా మరోసారి ఎందుకు కట్ చేయించాల్సి వచ్చిందని స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీనిపై మీడియా స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఈ ఘటన తన దృష్టికి రాలేదని చెప్పారు.

అయితే స్కూల్ ప్రిన్సిపాల్ పెరిన్ బాల్గీ మాట్లాడుతూ ప్రోఫెషనల్ బార్బర్‌నే పిలించామని, రోడ్డు పక్కన ఉండే బార్బర్‌ని కాదని చెప్పారు. స్కూల్ నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్‌కు అనుకూలంగా జుట్టు ఉండాలని, ఆమేరకు లేని విద్యార్థులకు స్కూల్ లోనే సరిచేయించాలనే ఉద్దేశంతో బార్బర్‌ను తీసుకొచ్చిన మాట వాస్తవం అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+