వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కాక్‌పిట్‌లోకి వెళ్లాడు, అరెస్ట్ చేసిన ఎయిర్‌పోర్ట్ పోలీస్

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై - కోల్‌కతా ఇండిగో విమానంలోని ఓ ప్రయాణీకుడు తన ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు కాక్‌పిట్‌లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశాడు. దీంతో విమాన సిబ్బంది అతనిని కిందకు దించేశారు. రెండ్రోజుల క్రితం ఓ ప్రయాణీకుడు ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న విమానంలో టాయిలెట్ డోర్ అనుకొని విమానం తలుపు తీశాడు.

ఇప్పుడు ఈ ప్రయాణీకుడు చార్జింగ్ పెట్టుకోవాలంటూ కాక్‌పిట్‌లోకి ప్రవేశించాడు. ఘటన జరిగిన సమయంలో అతను మద్యం తాగి ఉన్నాడని తెలుస్తోంది. వెంటనే సిబ్బంది అతనిని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.

Mumbai: Passenger offloaded for trying to open cockpit door

ఆ తర్వాత విచారించగా మద్యం మత్తులో అలా వ్యవహరించినట్లు చెప్పాడు. ఎయిర్ పోర్ట్ భద్రతా నిబంధనల ప్రకారం ఇతరులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించవద్దు. నిబంధనలు ఉల్లంఘిస్తే నేరం కింద చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తారు.

సోమవారం ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న గోఎయిర్ విమానంలో ఓ బ్యాంక్ ఉద్యోగి టాయిలెట్ డోర్ అనుకొని ఎగ్జిట్ డోర్ తెరవబోయాడు. అంతే ఒక్కసారిగా కలకలం రేగింది. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై వారించారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ పని చేయలేదని చెప్పాడు. అతని నుంచి సంతకాలు తీసుకొని విడిచిపెట్టారు.

English summary
A passenger was kicked off a Mumbai-Kolkata IndiGo flight after he tried to enter the cockpit to charge his phone, the airline said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X