కీచకుడు: రేప్ చేసి 13 ఏళ్ల బాలికను గర్బవతిని చేశాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: ఓ 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబై శివారులోని కండవలి చార్కోప్‌లో అతన్ని అరెస్టు చేశారు. 13 ఏళ్ల బాలికపై అతను అత్యాచారం చేశాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది.

ప్రస్తుతం బాలిక 28 నెలల గర్భాన్ని మోస్తోంది. 22 ఏళ్ల వయసు గల నిందితుడు ఇడ్లీలు విక్రయిస్తూ జీవితం కొనసాగిస్తున్నాడు అతను కండవలిలో బాధితురాలి ఇంటికి సమీపంలోనే నివసిస్తున్నాడు. అతన్ని పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేసి, శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు.

Mumbai Police arrests man for raping, impregnating 13-year-old girl

అతను బాలికపై ఏ సమయంలో ఏ రోజు అత్యాచారానికి పాల్పడ్డాడనేది తెలియదని, బాలిక షాక్‌కు గురైనందున ఏమీ చెప్పలేకపోతోందని పోలీసులు అంటున్నారు. బాలికను కుటుంబ సభ్యులు స్థానిక డాక్టర్ వద్దకు తీసుకుని వెళ్లడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

కడుపులో నొప్పి రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆల్ట్రా సౌండ్ పరీక్షలో ఆమె గర్భవతి అని తేలింది. డాక్టర్ సలహాతో కుటుంబ సభ్యులు చార్కోప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై ఏడు నెలల క్రితం అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man was arrested from Charkop in suburban Kandivali for allegedly raping a 13-year-old girl and impregnating her, police said on Friday.
Please Wait while comments are loading...