డాక్టర్ ఇంటిపైకి రాళ్లు: మోడల్, ఆమె సోదరుడి అరెస్టు

వైద్యుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాదంటూ శిఖా 2011లో కేసు పెట్టింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం - శిఖా తన సోదరుడితో కలిసి గత నెల 30వ తేదీన వైద్యుడి ఇంటికి వెళ్లారు. వారిని వైద్యుడు ఇంట్లోకి రానీయలేదు. దీంతో వారు వైద్యుడి ఇంటిపైకి రాళ్లు విసిరారు.
ఈ సంఘటనలో పోలీసులు మోడల్ శిఖాను విచారించి, అనంతరం అరెస్టు చేశారు. లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత శిఖాను, ఆమె సోదరుడిని బెయిల్‌పై విడుదల చేసే అవకాశాలున్నాయి.
శిఖా జోషిపై, ఆమె సోదరుడిపై పెట్టిన కేసులు బెయిల్‌కు అర్హమైనవి కావడంతో వారికి బెయిల్ లభిస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications