ఆదిపురుష్‌ మాటల రచయిత విషయంలో పోలీసులు కీలక నిర్ణయం

ముంబై: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ.. ఆదిపురుష్. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలయింది. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా. నాసిరకం గ్రాఫిక్స్ వాడటం వల్ల రామాయణాన్ని చూస్తోన్న ఫీలింగ్ కలగట్లేదని చెప్పినవారూ లేకపోలేదు.

ఆదిపురుష్ సినిమాపై క్రిటిక్స్ చేస్తోన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. రామాయణాన్ని సమూలంగా మార్చేసేలా ఈ కథను తీర్చిదిద్దారంటూ మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఉదాహరణగా చూపిస్తోన్నారు. రామాయణాన్ని చివరికి ఓ కల్పిత గాథగా భావించేలా దర్శకుడు ఓం రౌత్ సినిమాను తీశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు.

 Adipurush

ప్రత్యేకించి- లంకలో రావణుడి ముందు హనుమంతుడు చెప్పే డైలాగులు తీవ్ర విమర్శల బారిన పడ్డ విషయం తెలిసిందే. గుడ్డ నీ బాబుది, తైలం నీ బాబుది, కాలేది కూడా నీ బాబుదే అంటూ హనుమంతుడు చెప్పే డైలాగ్.. విమర్శల సునామీని ఎదుర్కొంది. రామయణ స్ఫూర్తిని దెబ్బతీసిందంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

దీనితో ఆదిపురుష్ యూనిట్ వెనక్కి తగ్గింది. ఆ డైలాగులను మార్చాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ మున్తాషిర్ శుక్లా ఓ ప్రకటన విడుదల చేశారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనిపై సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. వివాదాస్పద డైలాగులను సవరించదలచనున్నట్లు వెల్లడించారు. తనను సనాతన ద్రోహిగా ఆరోపించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఈ వివాదాలకు కారణమైన మనోజ్‌కు పెద్ద ఎత్తున బెదిరింపు ఫోన్ కాల్స్ అందాయి. రామాయణాన్ని కించపరిచేలా, అందులోని పాత్రలను వక్రీకరించేలా మాటలను రాసినందుకు ప్రాణలు తీస్తామంటూ పలువురు ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయాన్ని ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు.

 Adipurush

అటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో మనోజ్‌కు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. ఆదిపురుష్ పోస్టర్లను చించివేశారు. హిందూ మహాసభ సైతం ఆదిపురుష్ డైలాగులపై అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిర్మాతలపై లక్నో పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్రానికి వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలో సమాజ్‌వాది పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+