బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌కు షాక్.. నోటీసులు పంపిన ముంబై పోలీసులు..ఎందుకంటే.?
ముంబై: బాలీవుడ్ అగ్రదర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు ముంబై పోలీసులు నోటీసులు ఇచ్చారు. తనను లైంగికంగా వేధించాడని పేర్కొంటూ పాయల్ ఘోష్ బాంబు పేల్చింది. ఈ క్రమంలోనే ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు గురువారం హాజరు కావాల్సిందిగా అనురాగ్ కశ్యప్‌కు నోటీసులు ఇచ్చారు.
తన పట్ల అనురాగ్ కశ్యప్ వ్యవహరించిన తీరును చాలా క్లారిటీతో వివరించడంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర సినీ ఇండస్ట్రీల్లో కూడా పెద్దగా చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌లో కూడా ఇలాంటి యవ్వారమే ఒకటి నడుస్తోందంటూ గతంలో నటి శ్రీరెడ్డి ఏకంగా అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపింది.ఇక అగ్రదర్శకుల్లో ఒకరిగా ఉన్న అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళల సాధికారిత అంశంపై సినిమాలు తీసే అనురాగ్ కశ్యప్ వెనక ఇంతటి చీకటి కోణం దాగి ఉందా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. కొందరైతే పాయల్ పాపులారిటీ కోసమే ఇలాంటి అభాండాలు ఒక మంచి దర్శకుడిపై వేస్తోందని అన్న వాళ్లూ ఉన్నారు.

ఈ క్రమంలోనే అనురాగ్ కశ్యప్‌కు కూడా మద్దతు లభిస్తోంది. అనురాగ్ కశ్యప్ అలాంటి వాడు కాదని తన మాజీ భార్య కల్కికోయెచ్లిన్ చెప్పుకొచ్చింది. 2015లో అనురాగ్‌తో తాను దూరమైనప్పటికీ తన భద్రతపై ఎప్పుడూ ఆరా తీసేవాడని వెల్లడించింది. ప్రతి విషయంలోను తనకు అండగా నిలిచాడని గుర్తు చేసింది. ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఎదురవుతాయని... ఎక్కడా కృంగిపోకుండా ధైర్యంగా నిలవాలని అనురాగ్‌కు సూచించింది.

Recommended Video
ఇక అనురాగ్ కశ్యప్‌కు అండగా నిలిచింది మరో నటి తాప్సీ పన్ను.అనురాగ్ కశ్యప్‌కు అండగా నిలిచిన తాప్సీ పన్ను పై కూడా నెటిజెన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. స్త్రీల పట్ల అనురాగ్ కశ్యప్‌కు ఎంతో గౌరవం ఉందంటూ తాప్సీ ట్వీట్ చేసింది. ఆయన గొప్ప స్త్రీ వాదంటూ కితాబు ఇవ్వడంతో తాప్సీని టార్గెట్ చేశారు నెటిజెన్లు.
-
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications