ఈ కెమెరాకో దండం: కొట్టేసిన వ్యాలెట్ తిరిగిచ్చేసిన దొంగ! ‘ఫన్నీ’అంటూనే వార్నింగ్(వీడియో)
ముంబై: సీసీ కెమెరాలు వచ్చిన నాటి నుంచి ఎలాంటి దొంగతనం జరిగినా పోలీసులు ఇట్టే పట్టేస్తున్నారు. పోలీసులే కాదు.. సీసీ కెమెరాలు కూడా దొంగతనాలను తగ్గించేస్తున్నాయి. ఇందుకు ముంబైలో జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.
ముంబైలోని ఓ షాపింగ్ మాల్‌లో క్యూలో తన ముందున్న ఓ వ్యక్తి నుంచి అతని వ్యాలెట్ దొంగతనం చేశాడు ఓ దొంగ. దొంగతనం బాగానే చేశాననుకుంటూ అటు ఇటూ చూశాడు. ఒక్కసారిగా అక్కడున్న సీసీ కెమెరాకు చిక్కినట్లు తెలుసుకున్న ఆ దొంగ.. వెంటనే కెమెరాకు ఓ దండం పెట్టాడు.

ఆ తర్వాత మీ వ్యాలెట్ కిందపడిపోయిందంటూ తిరిగి ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. కాదు కాదు.. ఇచ్చేయాల్సిన పరిస్థితిని కల్పించాయి ఆ సీసీ కెమెరాలు. దీనిపై ముంబై పోలీసులు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చూడటానికి ఈ దొంగతనం చిలిపిగానే ఉన్నా.. శిక్ష మాత్రం కఠినంగానే ఉంటుందని హెచ్చరించారు.
The video is funny, but the consequences in reality will be quite serious! #EyeOpenersForYou pic.twitter.com/rcQqypvsqF
— Mumbai Police (@MumbaiPolice) August 20, 2018
కాగా, ఎప్పుడూ ఆసక్తి కర ఘటనలను, ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడండలో మొదటిస్థానంలో ఉంటారు ముంబై పోలీసులు. కాగా, పోలీసులు పెట్టిన ఈ ఫన్నీ దొంగ వీడియో ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
22 సెకన్ల వ్యవధి ఉన్న ఈ వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీన్ని పోస్ట్ చేస్తున్నామని, ముంబై వ్యాప్తంగా అత్యంత రద్దీ ప్రదేశాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ముంబై పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.












Click it and Unblock the Notifications