ముంబై: కుప్పకూలిన 2 అంతస్థుల భవనం, ఒకరి మృతి
ముంబై: భారీ వర్షాలు ముంబైవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముంబైలోని విఖ్రోలిలోని వర్షనగర్‌లో భవనం రెండంతస్థుల భవనం కుప్పకూలిపోయింది.ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మరోవైపు భారీ వర్షాల కారణంగా హోర్డింగ్ కూలిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సరిహద్దు రాష్ట్రాల నుండి ముంబైకి రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్‌డిఆర్ఎప్ బృందం సహయక చర్యల్లో పాల్గొంది. మరోవైపు విఖ్రోలిలోని సూర్యనగర్‌లో చోటుచేసుకొన్న మరో ఘటనలో ఇద్దరు మరణించారు.
రోడ్లన్నీ చెరువులుగా మారాయి. వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అత్యవసర పరిస్థితులుంటేనే రోడ్లపైకి రావాలని సీఎం ఫడ్నవీస్ ప్రజలకు సూచించారు.2005లో కురిసిన భారీ వర్షాల తరహలోనే ముంబైని వరదలు ముంచెత్తే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications