భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం - డ్రైనేజీలో కొట్టకుపోయిన ఇళ్లు - ఇంకొద్ది గంటల్లో తీవ్రతరం..

ఇప్పటికే కరోనా విలయంలో చిక్కుకున్న మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థాయి వర్షం కురవడంతో సిటీ చిగురుటాకులా వణికిపోయింది. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయ్‌గడ్ జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు చనిపోగా, వందల సంఖ్యలో ఆస్తులు ధ్వంసమయ్యాయి. జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

ముంబై సిటీలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదుకావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎవరూ ఎటూ కదలలేని స్థితిలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అత్యవసర సర్వీసులు తప్ప మిగతావేవీ పనిచేయలేదు. లోకల్ రైలు సర్వీసులకూ అంతరాయం ఏర్పడింది.

Mumbai Rains: city disrupted with record rainfall, IMD forecasts ‘extremely heavy’

కేవలం నాలుగు గంటల్లో 19.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, మొత్తం 10 గంటల్లో 23 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, గడిచిన 15 ఏళ్లలో ఇదొక రికార్డని బృహన్ ముంబై అధికారులు తెలిపారు. ఈలోపే, భారత వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. రాబోయే 24 గంటల్లో(బుధవారం) ముంబై సిటీతోపాటు పుణె, థానేలో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

శాంతా క్రజ్ ప్రాంతంలో నాలా ఉప్పొంగి ప్రవహించడంతో పక్కనే మురికివాడలోని ఓ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ఆ ప్రమాదంలో తల్లీబిడ్డలు, మరో వ్యక్తి గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు మృతదేహాలను వెలికి తీశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు సూచించారు.

Recommended Video

    Sushant Singh Rajput : Disha Salian మృతి పై ప్రెస్ మీట్ పెట్టి నిజానిజాలు బయటపెట్టాలనుకున్న Sushant!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+