రాయల్ లైఫ్: నెలకు రూ. 5 లక్షలు అద్దె, జైల్లో మస్త్ మజా!
ముంబైలో ఎంతో విశాలంగా ఉన్న ఆర్థర్ రోడ్డు జైల్లో డబ్బులు చెల్లిస్తే ఖైదీలు కూడా విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉందని, అసలు ఇంటికి, జైలుకు తేడానే కనిపించదని ఓ గ్యాంగస్టర్ బాంబే హైకోర్టు దృష్టికి...
ముంబై: ముంబై అర్థర్ రోడ్డు జైలు చాల పాతది. ఎంతో విశాలంగా ఉన్న ఆర్థర్ రోడ్డు జైల్లో డబ్బులు చెల్లిస్తే ఖైదీలు కూడా విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉందని, అసలు ఇంటికి, జైలుకు తేడానే కనిపించదని ఓ గ్యాంగస్టర్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాడు.
మాఫియా ముఠా నాయకుడు చోటా రాజన్ గ్యాంగ్ లోని విలాస్ భారతి అనే గ్యాంగ్ స్టర్ బాంబే హై కోర్టులో జైలు అథికారుల మీద ఫిర్యాదు చేశాడు. చోటరాజన్ గ్రూప్ లో పనిచేసిన విలాస్ భారతి మీద హత్యలు, దోపిడీల కేసులు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేశారు.
ముంబై ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్న అతను విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆర్థర్ రోడ్డు జైల్లో ఖైధీలు విలాసవంతమైన జీవితం గడపడానికి కొడిగుడ్డు ఆకారంలో ప్రత్యేక అండా బ్యారెక్ లు నిర్మించారు. ఈ బ్యారెక్ లోని సెల్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.

భద్రతతో పాటు విలాసవంతమైన జీవితం గడపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సెల్ లో ఖైదీలు ఉండాలంటే అధికారుల అనుమతి తీసుకోవాలి. ఉదాహరణకు నెలకు రూ. 2 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుందని విలాస్ భారతీ ఆరోపిస్తున్నారు.
.ఖైదీలు తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏ సెల్ కావాలంటే ఆ సెల్ ను తీసుకోవడానికి అవకాశం ఉంది.. అాయితే ముందుగా నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా జైలు సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని విలాస్ భారతీ బాంబే హైకోర్టుకు వెళ్లారు.
తాను ఆర్థర్ రోడ్డు జైలులోని అండ (కోడిగుడ్డు)సెల్ లో నెలకు రూ. 5 లక్షలు చెల్లించి గత 38 నెలల నుంచి ఉంటున్నానని విలాస్ భారతీ చెబుతున్నాడు. తనకు ఇంటి నుంచి భోజనం, సమయానికి ఆహారం, కాఫీ, టీ ఇస్తున్నారని కోర్టు కు చెప్పారు.
చదువుకోవడానికి పత్రికలు, టీవీ, రేడియో, పేక ముక్కలు ఇచ్చారని, అనేక సౌకర్యాలు కల్పించారని అంటున్నాడు. అయితే కొన్ని నెలల నుంచి తనకు రూ. 5 లక్షలు చెల్లించడం కష్టంగా మారిందని, నన్ను అండ సెల్ నుంచి బయటకు తీసుకు వచ్చి సాధారణ ఖైదీలకు కేటాయించే బ్యారెక్ లో పెట్టారని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.
గతంలో ఈ విషయం న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లానని, ఆ సందర్బంలో జైలు అధికారులు నకిలీ పత్రాలు కోర్టులో ఇవ్వడంతో తన పిటిషన్ కొట్టివేశారని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అంతే కాకుండా జైలు క్యాంటిన్ లో గుట్కా, గంజాయి విక్రయిస్తున్నారని కోర్టులో ఫిర్యాదు చేశారు.
శుక్రవారం రెండు ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలు ఈ పూర్తి వివరాలు ప్రచురించాయి. మొత్తం మీద ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్థర్ రోడ్డు జైల్లో ఖైదీలు విలాసవంతమైన జీవితం గడపడానికి ప్రత్యేక బ్యారెక్ నిర్మించారని వెలుగు చూసింది.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications