సెక్స్‌కు సహకరిచలేదని భార్యను కత్తితో పొడిచాడు

ముంబై: ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత కిరాకతంగా ప్రవర్తించాడు. రతిక్రీడకు సహకరించలేదనే కోపంతో ముంబై భందూప్‌లోని రిక్షా డ్రైవర్ గర్భవతి అయిన తన భార్యను కత్తితో పొడిచాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. 22 ఏళ్ల గాయాలతో విలవిలలాడుతోంది.

మూడు సార్లు అతను ఆమెను కత్తితో పొడిచాడు. అయితే, కడుపులో, పెద్ద పేవులో కత్తిపోట్లు పడ్డాయి. దీనివల్ల ఆమెకు గర్భవిచ్ఛిత్తి జరిగే ప్రమాదం ఉంది. సంఘటన జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులు 26 ఏళ్ల నిందితుడు ఇమ్రాన్ పఠాన్‌ను అరెస్టు చేశారు.

Women

ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని నెలల పాటు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. గాయాలు తీవ్రంగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. సియోన్ ఆస్పత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రశాంత్ కదం ఆమెకు శస్త్రచికిత్స చేశారు. పఠాన్ తల్లి బయటకు వెళ్లడంతో ఇంట్లో భార్య ఒంటరిగా ఉంది. విశ్రాంతి కోసం ఇంటికి వచ్చిన నిందితుడు ఘోరానికి పాల్పడ్డాడని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం.

వంటింట్లోని కత్తితో దాడి చేసిన తర్వాత పఠాన్ పారిపోయాడు. తనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో దగ్గరికి వెళ్లలేదని బాధితురాలు చెప్పింది. దాంతో ఆగ్రహంతో తనపై దాడి చేశాడని ఆమె చెప్పింది. భార్యను పొడవడానికి వాడిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి వివాహమై నెలన్నర అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+