16 ఏళ్ళ బాలుడిపై 8 మంది ఏడాదిగా అసహజ శృంగారం
16 ఏళ్ళ బాలుడిని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఏడాదిగా తోటి బాలురే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలోని అంధేరిలో చోటుచేసుకొంది. ఈ మేరకు డీఎన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.
ముంబై: 16 ఏళ్ళ బాలుడిని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఏడాదిగా తోటి బాలురే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబైలోని అంధేరిలో చోటుచేసుకొంది. ఈ మేరకు డీఎన్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.
2016లో బాలుడి ఇంటి పక్కనే ఉండే మరో బాలుడు అత్యాచారం జరుపుతూ వీడియో తీశాడు. అనంతరం ఈ వీడియోను అతని స్నేహితులకు షేర్ చేశాడు. ఆ వీడియోను చూపి బ్లాక్‌మెయిల్ చేస్తూ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేయడం ప్రారంభించారు.

బాలుడిని నిర్మానుష్య స్థలానికి తీసుకెళ్ళి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడేవారు. నిందితుల్లో ఒకరు బాలుడిని రెస్టారెంట్ వెళ్ళి తినడానికి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు.
అయితే బాధితుడు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో నిందితులు జూన్ 26న, మరోసారి అత్యాచారం జరిపాడు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడని సమాచారం.
నిందితుల నుండి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా కొట్టేవారని బాలుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసహజసిద్దమైన లైంగిక చర్యలకు పాల్పడిన 15 మంది బాలురిపై పోలీసులు పిల్లల సంరక్షణ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు.
నిందితుల్లో 8 మందిని అదుపులోకి తీసుకొన్నట్టు డీఎన్ నగర్ పోలీసులు తెలిపారు. నిందితులంతా 15 నుండి 17 ఏళ్ళ లోపు వయస్సు వారేనని పోలీసులు చెప్పారు. అయితే తీవ్రమైన కడుపునొప్పితో బాధితుడు ఇబ్బందిపడుతూ స్నేహితుడికి ఈ విషయాన్ని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications