దిగ్భ్రాంతికర ఘటన.. అద్దె అడిగాడని ఇంటి యజమానిపై హత్యాయత్నం!
Mumbai Shocker: ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అద్దె విషయంలో తలెత్తిన వివాదం చివరకు ప్రాణాల మీదికి తెచ్చింది. దేవోనార్ ప్రాంతంలో తన ఇంటి యజమానిని హత్య చేయడానికి ప్రయత్నించిన ఆరోపణలపై ఒక అద్దెదారుడు అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన జులై 21న జరగగా.. ఇంటి యజమాని అద్దె వసూలు చేయడానికి వెళ్లినప్పుడు ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
పోలీసుల వివరాల ప్రకారం.. జులై 21న ఇంటి యజమాని అద్దె వసూలు చేయడానికి దేవోనార్లోని తన అద్దె ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా ఇంటి యజమాని, అద్దెదారుడి మధ్య అద్దె విషయమై తీవ్ర వాగ్వాదం తలెత్తింది. మాట మాట పెరిగి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన అద్దెదారుడు తన వాహనంతో ఇంటి యజమానిని ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఇంటి యజమాని తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దాడి జరిగిన రెండు రోజుల తర్వాత అంటే జులై 23న గాయపడిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అద్దెదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గాయపడిన యజమానికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ముంబైలో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications