ఉగ్రవాదంలో చేరి చనిపోతానని ముందే తెలుసుకుని.. తిరిగి ఇంటికి వచ్చేశాడు

వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆరిఫ్ మజిద్ తప్పుడు బోధనల ప్రభావంతో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. దీంతో వెబ్‌సైట్ సహాయంతో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లతో కలవాలని నిర్ణయం తీసుకుని మరో ముగ్గురితో కలిసి టర్కీ వెళ్లాడు.
అక్కడికి వెళ్లిన తర్వాత ఆగస్టులో తాను చనిపోతున్నానని ముందే తెలుసుకోవడంతో.. ఈ నెల మొదట్లోనే మజీద్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఇంటికి తిరిగి వచ్చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.
తనతో పాటు ఇరాక్ వచ్చిన వారు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారని, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని మజీద్ తెలిపాడు. నిషేధిత సంస్ధల్లో చేరినందుకు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.












Click it and Unblock the Notifications