షాకింగ్: ఇండిగో, ఎయిరిండియా విమానాలు ఢీ..!
ఇటీవల విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన జరిగింది. ఇండిగో, ఎయిరిండియా సంస్థలకు చెందిన రెండు ప్యాసింజర్ విమానాలు ఢీకొన్నాయి. ఈ రెండు ప్యాసింజర్ విమానాల రెక్కలు ఒకదాన్నొకటి స్వల్పంగా ఢీ కొన్నాయి. కోయంబత్తూరుకు బయల్దేరిన ఎయిరిండియా విమానం AI 2732, HYD నుంచి ల్యాండ్ అయిన ఇండిగో 6E 791 విమానాల మధ్య ఈ ఘటన జరిగింది.
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన జరిగింది. ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. రెండు ప్యాసింజర్ విమానాలు ఒకదాన్నొకటి స్వల్పంగా ఢీ కొనడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ నుంచి ముంబై కు వచ్చిన ఇండిగో విమానం (6E 791), ముంబై నుంచి కోయంబత్తూర్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం (AI 2732) ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఈ రెండు ప్యాసింజర్ విమానాల రెక్కలు స్వల్పంగా ఢీకొన్నాయి.
ప్రమాద సమయంలో రెండు ప్యాసింజర్ విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. పెను ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులు, ఎయిర్ పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం అధికారులు మాట్లాడుతూ.. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రయాణీకులకు గానీ, విమాన సిబ్బందికి గానీ ఎటువంటి గాయాలు కాలేదని.. అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నా సంస్థల నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక గతేడాది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో దాదాపు 260 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications