వైరల్ వీడియో: మెట్రో స్టేషన్ లోనే నిశ్చితార్థం.. కారణం ఇదే..!
ముంబై మెట్రో స్టేషన్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఈ స్టేషన్ ఒక అరుదైన ప్రేమ కథకు వేదికైంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న జంటకు కులం పేరుతో అమ్మాయి తండ్రి నిశ్చితార్థం క్యాన్సిల్ చేయగా.. అబ్బాయి చిన్నమ్మ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. స్టేషన్ లో ఏడుస్తున్న అబ్బాయిని చూసి చలించిపోయిన ఆమె అమ్మాయిని అక్కడికే పిలిపించి మెట్రో ప్లాట్ ఫార్మ్ పైనే తంతు పూర్తి చేశారు. ఈ మెట్రో నిశ్చితార్థం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
वीडियो देखिए
— मिच्च मसाला (@micchamasala) February 6, 2026
Credit- A.M pic.twitter.com/SEHA6rymDD
ముంబై మెట్రో స్టేషన్ లోనే ఓ జంట నిశ్చితార్థం చేసుకున్న ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాళ్లిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కలిసి జీవితం ప్రారంభించాలని కలలు కన్నారు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇరువురి కుటుంబాలకు తెలియజేశారు. తొలుత ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి అంగీకరించాయి. వేడుకలో భాగంగా వరుడు.. తనకు కాబోయో అత్త, మామలను సొంత నగరమైన ముంబైకు ఆహ్వానించాడు. అయితే వేడుకలో వధువు తండ్రి ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇరు కుటుంబాల కులాలు వేరుగా ఉన్న కారణంగా వధువు తండ్రి పెళ్లికి నిరాకరించాడు. దాంతో మెట్రో స్టేషన్ వద్ద కూర్చుని వరుడు విలపించసాగాడు.

అతడి పరిస్థితి చూసి చలించిపోయిన అబ్బాయి చిన్నమ్మ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అమ్మాయిని అప్పటికప్పుడు మెట్రో స్టేషన్ కు పిలిపించారు. అక్కడే ఇద్దరికీ నిశ్చితార్థం చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications