Liquor: భార్య మీద డౌట్, గర్బవతి, కడుపులో బిడ్డ బలంగా ఉంటాడని భార్యతో ఏం తాగించాడంటే ?
బెంగళూరు/ చామరాజనగర: కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పాడు. పెళ్లి చేసుకున్న తరువాత అతని భార్యతో సంతోషంగా ఉన్నాడు. దంపతులు సినిమాలు, షికార్లు, బంధువుల ఇళ్లకు తిరిగారు. భార్య గర్బవతి అయ్యింది. అయితే భార్య మీద అనుమానంతో ఆమె మీద, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద పగ పెంచుకున్నాడు. కడుపులో బిడ్డ బలంగా ఉండాలంటే నువ్వు జ్యూస్ తాగాలని భర్త అతని భార్యకు మాయమాటలు చెప్పాడు. భర్త మాయమాటలు నమ్మిన భార్య అతను ఇచ్చిన జ్యూస్ తాగేసింది. భర్తను గుడ్డిగా నమ్మిన భార్య ప్రాణం పోయింది. గర్బిణి భార్య మీద అనుమానంతో ఆమెను దారుణంగా హత్య చేసిన భర్తకు కోర్టులో సరైన శిక్షపడింది.

పెళ్లికి గ్రీన్ సిగ్నల్
కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలోని కోళ్లేగాల తాలుకాలోని రాచప్పాజినగర (తమిళనాడు సరిహద్దు)లో ముత్తురాజ్ అలియాస్ చినకయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూపించిన జ్యోతి అనే యవతిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని ముత్తరాజ్ చెప్పాడు. ముత్తురాజ్ ను పెళ్లి చేసుకోవడానికి జ్యోతి కూడా అంగీకరించింది.

భార్య మీద డౌట్
2010లో జ్యోతిని పెళ్లి చేసుకున్న తరువాత ముత్తురాజ్ అతని భార్యతో సంతోషంగా ఉన్నాడు. ముత్తురాజ్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేశాడు. ముత్తురాజ్, జ్యోతి దంపతులు సినిమాలు, షికార్లు, బంధువుల ఇళ్లకు తిరిగారు. 2013లో ముత్తురాజ్ భార్య జ్యోతి గర్బవతి అయ్యింది. అయితే భార్య జ్యోతి మీద అనుమానం పెంచుకున్న ముత్తురాజ్ ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేను కాదు అని అనుమానం పెంచుకున్నాడు.

భార్యకు లిక్కర్ తాగించి చంపేశాడు
జ్యోతి మీద, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ముత్తురాజ్ పగ పెంచుకున్నాడు. కడుపులో బిడ్డ బలంగా ఉండాలంటే నువ్వు జ్యూస్ తాగాలని ముత్తురాజ్ అతని భార్య జ్యోతికి మాయమాటలు చెప్పాడు. ముత్తరాజ్ మాయమాటలు నమ్మిన జ్యోతి అతను ఇచ్చిన జ్యూస్ తాగేసింది. భర్త ముత్తురాజ్ ను గుడ్డిగా నమ్మి మద్యం సేవించిన జ్యోతి ప్రాణం పోయింది.

కిరాతకుడికి యావజ్జీవ శిక్ష
గర్బిణి భార్య జ్యోతి మీద అనుమానంతో ఆమె గర్బవతి అనికూడా చూడకుండా దారుణంగా హత్య చేసిన ముత్తురాజ్ ను 2013లోనే పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. నిందితుడు ముత్తురాజ్ అతని భార్య జ్యోతిని హత్య చేశాడని నేరం రుజువు అయ్యిందని, నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 2 లక్షలు జరిమానా విధిస్తున్నామని చామరాజనగర జిల్లా కోర్టు న్యాయమూర్తి బిఎస్. .భారతి తీర్పు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications