వివాహితను ప్రేమించి విషం కలిపిన విస్కీ బాటిల్ పంపిన అతనికి ఏమైంది

చెన్నై :వివాహితను ప్రేమించాడు ఓ యువకుడు...ఆమె కూడ ఆతనితో ప్రేమాయాణం సాగిస్తోంది. కాని, భర్తను వదిలి రావడానికి మాత్రం ఇష్టపడలేదు. తమకు ప్రేమకు భర్తే అడ్డుగా ఉన్నాడని బావించిన ఆ యువకుడు అతని అడ్డుతొలగించుకొనేందుకు ప్రయత్నించి కటకటలపాలయ్యాడు. తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొన్న ఈ ఘటన ప్రస్తుతం సంచలనం కల్గిస్తోంది.

చెన్నైలోని ప్రైవేట్ కంపెనీలోని ఇంజనీర్ గా పనిచేస్తోన్నారు వినాయకమూర్తి. ఈయన గౌతమి అనే వివాహితతో ప్రేమలో పడ్డాడు.ఆరుమాసాల క్రితం జరిగిన ఓ పంక్షన్ లో వీరిద్దరూ కలిశారు. అప్పటి నుండి ప్రేమాయణం సాగిస్తున్నారు.భర్తను వదిలి రావాలని వినాయకమూర్తి ఆమెను కోరాడు. కాని, ఆమెనిరాకరించింది,తమ ప్రేమకు అడ్డుగా ఉన్న గౌతమి భర్తను అడ్డు తొలగించుకోవాలని వినాయకమూర్తి భావించారు.

గౌతమి భర్త తీష్ కుమార్ ను అడ్డుతొలగించేందుకు పెద్ద ప్లాన్ చేశాడు వినాయకమూర్తి. చివరి ఈ ప్లాన్ ఫెయిలైంది. దీంతో వినాయకమూర్తి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు వేలూరు జిల్లా సాత్తుమదురైకి చెందిన సతీష్ కుమార్ కు అక్టోబర్ 28వ, తేదిన విస్కీ బాటిల్ ను పంపాడు వినాయకమూర్తి. ఈ విస్కీలో విషం కలిపాడు. ఈ విస్కీ బాటిల్ ను కొరియర్ లో పంపాడు వినాయకమూర్తి తప్పుడు చిరునామతో కోరియర్ ను పంపాడు.

 murder planning with poision mixing whisky bottle

ఈ విస్కీ తాగిన సతీష్ కుమార్ ఆయన స్నేహితుడు ప్ఫహ కోల్పోయారు. స్థానికులు వారిని ాసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో్ చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకొంటున్నారు సతీష్ కుమార్ ాయన స్నేహితుడు దీంతో పోలీసులు విచారణ ప్రారంభిస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.కొరియర్ పై ఉన్న అడ్రస్ తప్పుడని పోలీసులు గుర్తించారు. కొరియర్ చేసేందుకు వచ్చిన వారిని సిసి కెమెరాల ఆధారంగా వినాయకమూర్తిని గుర్తించారు.

సతీష్ కుమార్ భార్య గౌతమిపై పోలీసులు అనుమానపడ్డారు వారి అనుమానం నిజమైంది. ఆరు మాసాలుగా గౌతమి కాల్ డేటా సేకరించిన పోలీసులకు వాస్తవాలు తెలిశాయి. గౌతమితో ఆరు మాసాలకు పైగా వినాయకమూర్తి చాటింగ్ చేయడంతో పాటు తరచూ మాట్లాడుతున్న విషయాన్ని గుర్తించారు పోలీసులు. ఈ విషయమై గౌతమిని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగుచూసింది. సతీష్ కుమార్ అడ్డుతొలగించుకొనేందుకు వినాయకమూర్తి విషం కలిపిన విస్కీ బాటిల్ ను పంపినట్టు గుర్తించిన పోలీసులు వినాయకమూర్తిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+