రోడ్డుపై పొడిచారు, భార్యను వేధించాడని ఫ్రెండ్ హత్య
బెంగళూరు: బెంగళూరులో దారుణం జరిగింది. నడి రోడ్డు పైన ఓ వ్యక్తిని కత్తితో పొడిచారు. అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గంజాయి కోసం రెండు గ్రూపుల మధ్య గొడవనే ఈ కారణమని తెలుస్తోంది.

స్నేహితుడి భార్యను టీజ్ చేశాడని హత్య
బెంగళూరు పోలీసులు దీపు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీపు తన స్నేహితుడు శరత్‌ను హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన భార్యను శరత్ టీజ్ చేశారనే ఆరోపిస్తూ.. దీపు అతనిని హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
దీపు బండరాయితో కొట్టి శరత్‌ను చంపేశాడు. పోలీసులు అతనిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. అతనికి న్యాయస్థానం జ్యూడిషియల్ రిమాండుకు తరలించింది.
పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... శరత్ పలుమార్లు తన భార్యను వేధించినట్లుగా దీపు చెప్పాడు. ముఖ్యంగా దీపు బెంగళూరులో లేని సమయంలో వేధించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో దీపు భార్య ఈ విషయాన్ని అతనికి చెప్పింది.
మంగళవారం రాత్రి దీపు... తన స్నేహితుడు శరత్‌ను డ్రింక్స్ కోసం ఓ గార్డెన్‌కు పిలిపించాడు. ఇద్దరు కూడా తాగారు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో దీపు.. శరత్ పైన దాడికి పాల్పడ్డాడు. ఇది మంగళవారం అర్ధరాత్రి జరిగింది. అనంతరం దీపు అక్కడి నుంచి పారిపోయాడు.












Click it and Unblock the Notifications