ప్రభుత్వం ఉందా? లేదా?
వక్ఫ్ ఆస్తుల దోపిడీని అరికట్టడానికి, వాటిల్లో విప్లవాత్మక సంస్కరణలను తీసుకుని రావడానికి తీసుకొచ్చిన సవరణల చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించిన తరువాత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. ఆయా చోట్ల పాతుకుపోయిన తీవ్రవాదం, హింసాత్మక పరిస్థితులు, మనసత్వాన్ని ఇది- బయటపెట్టినట్టయింది.
మతపరమైన ఆస్తుల వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడానికి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ఓ అద్భుత, సాహస చర్యగా ప్రశంసలు అందుకుంటోన్న వక్ఫ్ సవరణ చట్టం 2025 ఆమోదం అనంతరం.. దేశవ్యాప్తంగా తీవ్రవాద వర్గాల నుండి నిరసనలు చెలరేగాయి. హింసాత్మక పరిస్థితులు పెచ్చరిల్లాయి.

ప్రత్యేకించి- పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు ముస్లిం సంఘాలు అల్లర్లు సృష్టించాయి. హిందూ కుటుంబాలు లక్ష్యంగా చేసుకున్నాయి. దోపిడీకి పాల్పడ్డాయి. పట్టపగలు షాపులపై పడి స్వైర విహారం చేశాయి.
అక్కడి ప్రజలు తమ ఇళ్లను వదిలి కట్టుబట్టలతో పారిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. రాళ్ల దాడి, గృహదహనాలు, హిందువులను బహిరంగంగా బెదిరించడం అనేవి సర్వసాధారణం అయ్యాయక్కడ. ఆయా హింసాత్మక పరిస్థితకు కారణమైన వాళ్లల్లో ఇప్పటివరకు 150 మందిని అరెస్టు చేశారు. ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది.
Videos which shows the situation in Kolkata today:#WaqfBill protestors blocked roads and swirled "Palestinian flag" on hijacked buses: pic.twitter.com/cFZ5hUDWGq
— @jxh45 (@jxh45) April 10, 2025
హింస చెలరేగిన ప్రాంతానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. అందులో- హిందువులను కుక్కలుగా అభివర్ణించడం కనిపించింది. తాము అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ల పని పడతామంటూ హెచ్చరించాడో వ్యక్తి. ఇది- ఏ మాత్రం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతోన్న తీవ్రవాద మనస్తత్వానికి నిలువెత్తు నిదర్శనమంటూ బీజేపీ మండిపడుతోంది. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
సువేందు అధికారి, సుకాంత మజుందార్, దిలీప్ ఘోష్, అభిజిత్ గంగోపాధ్యాయ వంటి బీజేపీ సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. ముర్షీదాబాద్ అల్లర్ల విషయంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ మౌనంగా ఉండటాన్ని నిలదీశారు. తమ ఇళ్లల్లో నుంచి హిందువులను తరిమికొడుతున్నప్పటికీ- మమత బెనర్జీ ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుంటోందని, చేష్టలుడిగి చూస్తోందని ఆరోపించారు.
ముర్షిదాబాద్ ఒక్కటే కాదు. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, పాట్నా, సిల్చార్, లక్నో, తమిళనాడులోని హోసూరు వంటి నగరాల్లో కూడా నిరసనలు చెలరేగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చట్టాన్ని తిరస్కరించాలంటూ హైదరాబాద్‌లో నిరసనకారులు డిమాండ్ చేశారు.
Over a thousand families have fled their homes in Murshidabad and taken shelter in nearby districts. Last week, I covered the Mothabari riot, and now this.
— Dr. Archana Majumdar (@DrArchanaWB) April 13, 2025
This video is proof of what women and children are enduring in West Bengal due to the Waqf Bill protests—fueled by… pic.twitter.com/JdfJOUa9Sn
అస్సాంలోని సిల్చార్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. 400 మందికి పైగా ఆందోళనకారులు ఈ అల్లర్లల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఢిల్లీలోని జామా మసీదులో నిరసనలు శాంతియుతంగా కొనసాగినప్పటికీ- దేశవ్యాప్తంగా సంభవించిన ఉదంతాలు దీని తీవ్రతకు అద్దం పట్టాయి.
నిజానికి- వక్ఫ్ బోర్డేమీ రాజ్యాంగానికి అతీతం కాదు. చాలా కాలంగా వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగానికి గురి అవుతూ వస్తోన్నాయి. పేద ముస్లింలు- ముఖ్యంగా పాస్మాండ ముస్లింలకు ఈ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తోంది.
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో పారదర్శకత, జవాబుదారీతనం, వారసత్వంగా వస్తున్న మతగురువులు, భూ మాఫియాల గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేసేలా ఈ సవరణలు చోటు చేసుకున్నాయి. ఊహించినట్టే- కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎఐఎంఐఎం ఈ వక్ఫ్ సవరణల చట్టాన్ని వ్యతిరేకించాయి.
VIDEO | Kolkata: Aliah University students hold protest over Waqf (Amendment) Act.
— Press Trust of India (@PTI_News) April 11, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/c1FI7VeQwd
తీవ్రవాద శక్తుల నుండి వచ్చిన బహిరంగ విద్వేషపూరిత ప్రసంగం, హింసను ఆయా పార్టీల నాయకులు ఖండించడానికి నిరాకరించడమే దీనికి ఉదాహరణ. ఆయా పార్టీల సంతుష్టీకరణ, బుజ్జగింపులు, జాతీయ భద్రతను పణంగా పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోన్నారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వినిపిస్తోన్నాయి.
బీజేపీ నాయకుడు తరుణ్ ఛుగ్.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆధునిక జిన్నాతో పోల్చారు. ఆమె మైనారిటీలను బుజ్జగించడం కోసం హిందువుల భద్రతతో రాజీ పడుతున్నారని ఆరోపించారు. ముర్షిదాబాద్‌లో ముగ్గురి మరణంపై ఆమె మౌనంగా ఉండటాన్ని తప్పుపట్టారు.
ముర్షీదాబాద్ హింసను స్టేట్ స్పాన్సర్డ్‌గా అభివర్ణించారు మరో బీజేపీ నేత షెహజాద్ పూనావాలా. ఆలయాల అపవిత్రత, బలవంతపు వలసలు లక్ష్యంగా సాగించిన దహనాలకు తృణమూల్ కాంగ్రెస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హిందువులపై సాగించిన విద్వేషపూరిత ప్రసంగాన్ని మమతా బెనర్జీ ఎందుకు ఖండించట్లేదంటూ బీజేపీ బెంగాల్ రాష్ట్ర శాఖ మమతను నిలదీసింది.
ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. వక్ఫ్ సవరణల చట్టం వ్యవహారంలో మోదీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదు. వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోబోమంటూ తేల్చి చెబుతోంది. శాంతిభద్రతలు కల్పించడం, మతపరమైన అవినీతిని నిర్మూలించడం, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాధారణ పౌరులను రక్షించుకోవడం వంట చర్యలపై మోదీ సర్కార్ దృష్టి సారించింది.
ప్రతిపక్ష పార్టీలు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ- బీజేపీ వెనక్కి తగ్గట్లేదు. ఈ నెల 20 నుండి మే 5వ తేదీ వరకు వక్ఫ్ సంస్కరణల అవగాహన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. సవరణల చట్టం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ముస్లిం సమాజానికి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications