రాజ్యసభకు ఇళయరాజా..!! స్వామి స్థానంలో నియామకం - ప్రధానిపై ప్రశంసలతో..!!

ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజకు బంపరాఫర్ వచ్చింది. ఆయన భారత పార్లమెంట్ లో పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయటం లాంఛనం కానుంది. దశాబ్దాల కాలంగా సినీ సంగీత దర్శకుడుగా ఎన్నో అవార్డులు - రివార్డులు సొంతం చేసుకున్న ఇళయరాజా ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కాబోతున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. రాష్ట్రపతి కోటాలో ఆయన్ను రాజ్యసభకు నామినేటె చేయటం ఖాయంగా తెలుస్తోంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు ఎంపిక చేసారు. 12 మంది సభ్యులను రాజ్యసభకు రాష్ట్రపతి నామినేటెడ్ చేస్తారు. ఇప్పుడు అదే కోటాలో ఇళయరాజా పెద్దల సభలో సభ్యుడు కాబోతున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుబ్రమణ్య స్వామి ఇదే కోటాలో ఎంపికయ్యారు. ఆయన ఆరేళ్ల కాల పరిమితి ముగుస్తోంది. ఆయన స్థానంలో అదే రాష్ట్రానికి చెందిన ఇళయరాజాను ఎంపిక చేసేందుకు రంగం సిద్దం అయిందని తెలుస్తోంది. తాజాగా.. అంబేడ్కర్‌-మోదీ పుస్తకానికి సంబంధించి ముందు మాటలో ప్రధాని మోదీ..అంబేద్కర్ ఆశయాలను నెరవేస్తున్నారని ఇళయరాజా ప్రశంసించారు. ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చకు కారణమయ్యాయి. విమర్శలు వినిపించాయి. సంగీతానికి మేస్ట్రోగా ఉన్న ఇళయరాజా ఇప్పుడు పెద్దల సభలో అడుగు పెడుతున్నారనే వార్తలు అటు పొలిటికల్ ..ఇటు సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

Music Maestro Ilayaraja to Rajyasabha, heaps praise on PM Modi-to replace Subramanian Swamy

ప్రధాని మోదీని ప్రశంసించి..బీజేపీ వర్గాల మద్దతు పొందితే..అదే సమయంలో అంబేద్కర్ ను ప్రధానితో మోదీతో పోల్చుతూ ఇళయరాజా వ్యాఖ్యలు చేయటం బీజేపీ వ్యతిరేకులకు రుచించలేదు. ఇక, ఇప్పుడు ఇళయరాజా పెద్దల సభకు ఎంపిక కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం పైన బీజేపీ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీని పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నా...ఇళయరాజా సైతం స్పందించినట్లుగా సమాచారం లేదు. దీంతో...ఇక, ఆయన నియామకం ఖాయమనే ప్రచారం ఢిల్లీలో జోరుగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+