కూతురికి 'గోవు'ను పెళ్ళికి గిఫ్ట్ గా ఇచ్చిన ముస్లిం తండ్రి
గో రక్షణ పేరిట దేశంలో దాడులు పెచ్చుమీరుతున్న తరుణంలో ఓ ముస్లిం తండ్రి తన కూతురుకు వివాహం సందర్భంగా ఆవును బహుమతిగా ఇచ్చాడు.ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకొంది.
రోహతక్: గో రక్షణ పేరిట దేశంలో దాడులు పెచ్చుమీరుతున్న తరుణంలో ఓ ముస్లిం తండ్రి తన కూతురుకు వివాహం సందర్భంగా ఆవును బహుమతిగా ఇచ్చాడు.ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకొంది.
హార్యానా రాష్ట్రంలోని సొనిపట్ జిల్లా ఖార్ ఖొద్దా గ్రామానికి చెందిన నూర్ ఖాన్ తన కూతురు గుల్షానాకు పెళ్ళి కానుకగా సుమారు 15 వేల రూపాయాలతో ఆవును కొని బహుమతిగా ఇచ్చాడు.

తన కూతురికి ఆవులంటే చాలా ఇష్టమని నూర్ ఖాన్ చెప్పాడు. ఆవులు ఎక్కడ కనబడితే బ్రెడ్డు , బెల్లం పెడుతుందని చెప్పారు. ఆవును సాకేందుకు తన ఇంట్లో సరిపడు స్థలం లేనందున అతడు బాధపడ్డాడు.
వివాహ సందర్భంగా వివాహం సందర్భంగా ఓ ముస్లిం వ్యక్తి తన కూతురుకు ఆవును బహుమతిగా ఇవ్వడం బహుశా ఇదే ప్రథమం. ఈ బహుమతి పట్ల గుల్షానా సంతోషాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications