ఫ్రెండ్ అంత్యక్రియలు నిర్వర్తిచేందుకు మతం అడ్డురాలేదు
భోపాల్: మానవత్వానికి, స్నేహానికి మతం అడ్డుకాదంటూ ఓ ముస్లిం యవకుడు నిరూపించాడు. అనారోగ్యంతో మరణించిన తన స్నేహితుడికి హిందూ మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వర్తించాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు సమీపంలోని బైతుల్ జిల్లాలో సంతోష్ సింగ్ థాకూర్ అనే కార్మికుడు అనారోగ్యంతో మృతిచెందాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్యతప్ప బంధువులెవరూ లేరు.

దీంతో సంతోష్ సింగ్ అంత్యక్రియలు నిర్వర్తించడానికి దగ్గరవారంటూ ఎవరూ లేకపోయారు. సంతోష్ మృతితో అతని కుటుంబ దిక్కులేనిదైపోయింది. సంతోష్‌కి అబ్దుల్ రజాక్ అనే ఒక వ్యక్తి స్నేహితుడు.
సంతోష్ కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయిన అబ్దుల్ రజాక్ హిందూ సంప్రదాయ ప్రకారం స్నేహితుడు సంతోష్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించాడు. తమ స్నేహం కులం ప్రాతిపదికన ఏర్పడలేదని, ఓ స్నేహితుడు ఏం చేయాలో తాను కూడా అదే చేశానని సంతోష్ సింగ్ చెప్పాడు.












Click it and Unblock the Notifications