పదేళ్లలో 24శాతం పెరిగిన ముస్లీం జనాభా, జాతీయ సగటు కంటే ఎక్కువ
న్యూఢిల్లీ: 2001 నుండి 2011 వరకు ముస్లీం జనాభా అత్యధికంగా పెరిగింది. 24 శాతం మేర ముస్లీం జనాభా పెరిగింది. 2011 జనాభా లెక్కలకు సంబంధించి కులమతాలవారీ గణన వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం.. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా జమ్మూ కాశ్మీర్‌లో ముస్లీం జనాభా అధికంగా ఉంది.
జమ్మూ కాశ్మీర్‌లో ముస్లీం జనాభా 68.3 శాతంగా ఉంది. రెండో స్థానంలో అసోం ఉంది. 34.2 శాతం ఉంది. 27 శాతంతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉంది. 1991 నుండి 2001 మధ్య ముస్లీం జనాభా పెరుగుదల 29 శాతంగా ఉంది. ఇప్పుడు అది మరింత పెరిగింది.

2001 నుండి 2011 మధ్య భారత దేశంలో జనాభా పెరుగుదల కంటే ముస్లీం జనాభా పెరుగుదల శాతం చాలా ఎక్కువగా ఉంది. అసోంలో 2001లో ముస్లీం పాపులేషన్ 30.9 శాతం ఉండగా, ఇప్పుడు 34.2 శాతానికి పెరిగింది. పదేళ్లలో భారీగా పెరగడం గమనార్హం. కాగా, అసోంకు బంగ్లాదేశ్ నుండి గత మూడు దశాబ్దాలుగా అక్రమంగా వస్తున్నారు.
కేవలం మణిపూర్ రాష్ట్రంలో మాత్రమే జనాభా పెరుగుదల తగ్గింది. ఈ రాష్ట్రంలో జనాభా పెరుగుదల 8.8 శాతం నుండి 8.4 శాతానికి తగ్గింది. పశ్చిమ బెంగాల్‌కు కూడా అక్రమంగా బంగ్లాదేశ్ నుండి వస్తున్నారు. 2001లో ముస్లీం జనాభా పెరుగుదల శాతం 25.2 శాతంగా ఉండగా, 2011కు 27 శాతానికి పెరిగింది.
అలాగే, ఉత్తరాఖండ్‌లోను ముస్లీం జనాభా పెరిగింది. 11.9 నుండి 13.9 శాతానికి పెరిగింది. కేరళలో 24.7 నుండి 26.6 శాతానికి, గోవాలో 6.8 నుండి 8.4 శాతానికి, జమ్మూ కాశ్మీర్‌లో 67 నుండి 68.3 శాతానికి, హర్యానాలో 5.8 నుండి 7 శాతానికి, ఢిల్లీలో 11.7 నుండి 12.9 శాతానికి పెరిగింది.












Click it and Unblock the Notifications