జ్ఞాన్‌వాపీ మసీదు వివాదం: నేడు సుప్రీంకోర్టు ముందుకు అంజుమన్ పిటిషన్
ఉత్తరప్రదేశ్‌లో గల కాశీ విశ్వనాథ్- జ్ఞాన్‌వాపీ మసీదు వివాదం కొసాగుతోంది. దీనికి సంబంధించి ఇవాళ మూడురోజుల పాటు చేసిన సర్వే నివేదికను అందజేయాల్సి ఉంది. అయితే ఈ కేసులో ముస్లింలు ఫైల్ చేసిన అంశాలపై విచారణ జరగనుంది. దీంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
మసీదు మేనెజ్ మెంట్ కమిటీ అంజుమన్ ఈ ఇంతెజమీయ గత వారం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వారణాసి సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఇక్కడ ఆలయం ఉండేదని సివిల్ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిపై అంజుమన్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తమకు అనుకూలంగా తీర్పు వస్తోందని ఆశాభావంతో ఉంది.

వివాదాస్పద కాశీ విశ్వనాథ ఆలయం, గ్యాన్‌వాపి మసీదు పరిసర ప్రాంతాలను భారత పురావస్తు విభాగం ఆధ్వర్యంలో సర్వే చేయడానికి అనుమతిస్తూ వారణాసిలోని స్థానిక కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని అంజుమన్ కమిటీ తప్పుపట్టింది. ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతం 2 వేల ఏళ్ల కిందటి నుంచి కాశీ విశ్వనాథ ఆలయానికి చెందిందని, 1664లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ అక్కడ అక్రమంగా మసీదు నిర్మించినందున ఆ ప్రాంతాన్ని మళ్లీ ఆలయానికి స్వాధీనం చేయాలని 2019లో వీఎస్ రస్తోగి అనే న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మొత్తం ఈ ప్రాంతాన్ని సర్వే చేయాలని అందులో కోరారు. దీనిపై వారణాసిలోని స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. దీనిని ముస్లిం బాడీ సవాల్ చేసింది. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications