దారుణం: గోసంరక్షణ చేస్తోందని ముస్లీం మహిళపై దాడి, ఇంట్లోవాళ్లు కూడా..
భోపాల్: ఆవులను సంరక్షిస్తున్నందుకు ఓ ముస్లీం మహిళను ఆమె బంధువులే వేధించిన సంఘటన వెలుగు చూసింది. దీంతో ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి కాపాలంటూ విజ్ఞప్తి చేశారు. భోపాల్‌కు చెందిన మెహరున్నీసా ఖాన్ గోశాలను నిర్వహిస్తున్నారు.
ఇందుకుగాను కొందరు ఆమెపై దాడి చేశారు. ఆమె దాడి విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అంతేకాదు, తన ఇంట్లోని వారు కూడా తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. తనను ఇంటివారు, కుమార్తె కూడా ఉందని వాపోయారు. ఆమె ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కూడా విజ్ఞప్తి చేశారు.

ఆమె మాట్లాడుతూ.. గోశాలను నిర్వహిస్తున్నందుకు తమ బంధువులు కూడా మాటల దాడి చేస్తున్నారని చెప్పారు. తనను మాటలతో వేధిస్తున్నారని చెప్పారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ ఎలాంటి స్పందన లేదన్నారు. అందుకే తాను సీఎంకు, ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఆమె రాష్ట్రీయ గోసేవా సమితి అధ్యక్షురాలిగా ఉన్నారు. నీమచ్ సమీపంలో గోశాలను నిర్వహిస్తున్నారు. తనను కిడ్నాప్ చేసి హత్య చేయాలని చూస్తున్నారని వాపోయారు. తనపై యాసిడ్ దాడి జరిగే అవకాశముందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలు కాపాడాలని కోరారు.
కాగా, మెహరున్నీసా గతంలో ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. ఆ సమయంలోను ఆమెకు చాలా బెదిరింపులు వచ్చాయి. మహిళల సమానత్వం కోసం ఆమె ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించారు. కాగా, పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications