యూపీలో బీజేపీ హవా: వీరంతా ఏం కోరుకుంటున్నారంటే..
ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ గాలి వీచినట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. అయితే కమలం పార్టీకి పూర్తి మెజార్టీ మాత్రం వచ్చే అవకాశాలు లేవని ఎక్కువ సర్వేలు తేల్చాయి. దీంతో హంగ్ వచ్చే అవకాశముందని స్పష్ట
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ గాలి వీచినట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. అయితే కమలం పార్టీకి పూర్తి మెజార్టీ మాత్రం వచ్చే అవకాశాలు లేవని ఎక్కువ సర్వేలు తేల్చాయి. దీంతో హంగ్ వచ్చే అవకాశముందని స్పష్టమవుతోంది.
బీజేపీకి చెక్ పెట్టేందుకు ఎస్పీ-బీఎస్పీ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలను కూడా కొట్టేసే పరిస్థితి లేదు. ఇప్పటికే సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. తమకు తక్కువ సీట్లు వస్తే బీఎస్పీతో జత కట్టేందుకు సిద్ధమన్నారు. మాయావతి నుంచి మాత్రం స్పందన రాలేదు.

ముస్లీంలు కోరుకుంటున్నది ఇదే
యూపీలో ఉన్న ఎక్కువ మంది ముస్లీంలు ఎస్పీ-బీఎస్పీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. హంగ్ ఏర్పడే పరిస్థితి వస్తే.. బీజేపీని పక్కన పెట్టాలని వారు కోరుకుంటున్నారు.

సర్వేలో ఏం చెప్పారంటే..
'క్రౌడ్ న్యూసింగ్' ఈ విషయమై ఓ సర్వే చేసింది. 92 శాతం మంది ముస్లీంలు హంగ్ పరిస్థితి వస్తే ఎస్పీ-బీఎస్పీ కలవాలని చెప్పాయి. ఈ రెండు పార్టీలు కూడా తమ తమ విభేదాలు పక్కన పెట్టాలని కోరుకుంటున్నారు.

ఈ ప్రాంతాల్లో సర్వే..
10 ముస్లీం మెజార్టీ ప్రాంతాలలో ఈ సర్వే నిర్వహించారు. 2,600 మందిని ఈ విషయమై అడిగారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో సర్వే చేశారు. ఇందులో ఎక్కువ శాతం మంది మాయావతి - అఖిలేష్ కలవాలని కోరుకున్నారు.

బీజేపీపై అసంతృప్తితోనే..
ఎన్నికల్లో ముస్లీం ఓట్లు ఎస్పీ-కాంగ్రెస్, బీఎస్పీల మధ్య చీలిపోయాయి. ఎస్పీ-కాంగ్రెస్ 55 శాతం ఓట్లు, బీఎస్పీ 36 శాతం ఓట్లు ఆ వర్గం నుంచి పొందాయని తెలుస్తోంది. బీజేపీ పైన అసంతృప్తితోనే వారు ఈ పార్టీలు కలవాలని కోరుకుంటున్నాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications