Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మీ తాత నెహ్రూనే చైనాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు: బీజేపీ, 'పాక్‌లో రాహుల్ వ్యాఖ్యలే హెడ్డింగ్'

Recommended Video

    Lok Sabha Election 2019 : Rahul Gandhi Tweeted On Modi 'Weak Modi Scared Of Xi' | Oneindia Telugu

    న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. అసలు మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూనే చైనాకు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి స్థానాన్ని బహుమతిగా ఇచ్చారని ధ్వజమెత్తారు.

    భారత్‌కు రావాల్సిన ఆ స్థానాన్ని మీ ముత్తాత చైనాకు ఇచ్చారని, మీ కుటుంబం చేసిన తప్పులనే ఇప్పుడు భారత్ అనుభవిస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై కచ్చితంగా భారత్ విజయం సాధించి తీరుతుందన్నారు. ఆ పనిని నరేంద్ర మోడీకి వదిలేయాలన్నారు. మీరు చైనా రాయబారులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించుకోండని ఎద్దేవా చేశాయి.

    కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ కూడా ఘాటుగా స్పందించారు. అసలు జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాది మసూద్ అజహర్ విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై భారత్ మొత్తం బాధలో ఉంటే రాహుల్ గాంధీ మాత్రం దానిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని ప్రశ్నించారు. అతని వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో హెడ్ లైన్ అవుతాయన్నారు.

    Must Be Headline In Pak: BJP On Rahul Gandhis Modi Scared Of Xi Dig

    కాగా, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ గురువారం నిప్పులు చెరిగారు. జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్‌ను గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటన చేయకుండా చైనా అడ్డుకుంది. దీనిపై ఆయన స్పందించారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ముందు బలహీనుడైన ప్రధాని మోడీ మోకరిల్లుతున్నారని ట్వీట్ చేశారు.

    భద్రతా మండలిలో భారత్‌కు వ్యతిరేకంగా చైనా వ్యవహరించిన తర్వాత ఒక్కమాట కూడా నరేంద్ర మోడీ నోటి నుంచి రాలేదని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. గుజరాత్‌లో జీ జిన్‌పింగ్‌తో కలిసి చక్కెర్లు కొట్టడం, ఢిల్లీలో ఆయనను హత్తుకోవడం, చైనాలో ఆయనకు మోకరిల్లడం.. ఇదే చైనాకు సంబంధించి మోడీ దౌత్య విధానం అని విమర్శలు గుప్పించారు. జీ జింగ్‌పింగ్‌ను చూసి మోడీ భయపడుతున్నారన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+