ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూత ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ముత్తూట్ కుటుంబ

ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ముత్తూట్ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన వ్యాపారవేత్త. పూర్తి పేరు మత్తయ్య జార్జ్ జార్జ్ ముత్తూట్. ఆయన సారథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ దేశంలో గోల్డ్ లోన్ ఇచ్చే అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది. కేరళలోని కొచ్చి ప్రధాన కార్యాలయంగా ముత్తూట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ముత్తూట్ ఫైనాన్స్‌కు దేశవ్యాప్తంగా పలు శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని లక్షల మంది ఖాతాదారులు ఉన్నాయి. ఫోర్బ్స్ ఆసియా మేగజైన్ ఎంజీ జార్జ్ ముత్తూట్‌‌కు 2011లో దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 50వ స్థానం కల్పించింది. 2019 నాటికి జార్జ్ ముత్తూట్ 44వ స్థానానికి ఎగబాకారు.

Muthoot Group chairman MG George Muthoot passes away

తన కుటుంబ వ్యాపారంలో జార్జ్ చిన్న వయస్సులోనే అడుగిడారు. అనతికాలంలో 1979లో ముత్తూట్ ఎండీగా ఎన్నికయ్యారు. 1993 నుంచి ముత్తూట్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇతని హయాంలో కంపెనీ 51 వేల కోట్ల మార్కెట్ సాధించింది. దీంతో కంపెనీ ఆదాయం 8 వుల 722 కోట్లకు చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+