నా కూతురు రాజకీయాల్లోకి నో, వదిలేయండి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: తన కూతురు రాజకీయాల్లోకి రావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కేజ్రీవాల్ కూతురు రాజకీయాల్లోకి వస్తారని ఇటీవల ప్రచారం సాగింది. ఏఏపీ యూత్ వింగ్‌ను లీడ్ చేస్తారని ప్రచారం సాగింది.
దీనిపై అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల క్రితం సామాజిక వెబ్‌సైట్ ద్వారా స్పందించారు. తన కూతురు రాజకీయాల్లోకి రాబోతుందని మీడియాలో ప్రచారం జరుగుతోందని, కానీ అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు.

తన కూతురు కొద్ది రోజుల క్రితమే ఐఐటీ ఢిల్లీలో జాయిన్ అయిందని చెప్పారు. ఆమె ఓ ప్రోగ్రాం నిమిత్తం వచ్చారని తెలిపారు. దయచేసి ఆమెను ప్రశాంతంగా ఉండనీయండని విజ్ఞప్తి చేశారు.
కాగా, కేజ్రీవాల్ కూతురు హర్షిత రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆ పార్టీ కొత్త స్టూడెంట్ వింగ్ ఛాత్ర యువ సంఘర్ష సమితి (సీవైఎస్ఎస్)ను ఏర్పాటు చేయనుందని, దాని బాధ్యతలు ఆమెకు ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి.












Click it and Unblock the Notifications