కేజ్రీవాల్‌పై..: నవ్వుతూ రమ్య సమాధానాలు (పిక్చర్స్)

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి, మాండ్య కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన మాట్లాడుతూ... ప్రముఖ నటుడు, మంత్రి అంబరీష్‌ను రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది తన తండ్రేనని చెప్పారు.

కెఆర్ పీట్ కళాశాలలో రమ్య విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అదే సమయంలో అంబరీష్ ఆరోగ్యం గురించి ఆందోళన పడవద్దని సూచించారు. అంబరీష్ బెంగళూరులోని ఆసుపత్రిలో కోలుకుంటున్నారని చెప్పారు.

కాగా, మాండ్య నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన రమ్య ఇటీవల పార్లమెంటు సమావేశాలలో మొదటిసారి మాట్లాడి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.

రమ్య

రమ్య

ప్రముఖ కన్నడ నటి, మాండ్య కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు రమ్య బుధవారం ఓ కళాశాలలో విద్యార్థులతో ముచ్చటించారు.

అంబరీష్

అంబరీష్

కన్నడ నటుడు, మంత్రి అంబరీష్‌ను రాజకీయాల్లోకి తన తండ్రి తీసుకు వచ్చారని రమ్య చెప్పారు. అంబరీష్ తన తండ్రికి మద్దతు పలికారన్నారు. ఇప్పుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

రమ్య - దివ్య స్పందన

రమ్య - దివ్య స్పందన

ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... అంబరీష్ తన బాగోగులు కోరుకునే వ్యక్తి అన్నారు. అంబరీష్ ఆసుపత్రిలో కోరుకుంటున్నారని చెప్పారు. శ్వాసకోస సమస్య, ఊపిరితిత్తుల సమస్యలు ఎదుర్కొన్నారని, ఆయన ఇప్పుడు బాగా ఉన్నారని చెప్పారు.

దివ్య స్పందన

దివ్య స్పందన

రానున్న ఎన్నికల్లో మీకు మేం ఎందుకు ఓటేయాలని ఓ విద్యార్థి ప్రశ్నిస్తే, రమ్య స్పందిస్తూ... ఇది పోటీ ప్రపంచమని, ప్రజలకు ఏం చేయాలో తనకు స్పష్టత ఉందని ఆమె తెలిపారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మాండ్య పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ దివ్య స్పందన నవ్వుతూనే సమాధానం చెప్పారు.

ఎంపి

ఎంపి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పైన ఓ విద్యార్థి ప్రశ్నించినప్పుడు... రమ్య స్పందించారు. కేజ్రీవాల్‌తో తనకు పోలిక లేదని, పదవిలోకి వచ్చాక వారు ఏం చేయలేక పారిపోయారని, అతను అనుభవంలేని నాయకుడు అని, ఇన్ కంప్లీట్ లీడర్ అని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+