అమ్మ చెప్పింది.. ఆ మాట తప్పని: ఆర్డినెన్స్‌పై రాహుల్

అయినా తాను యువకుడినని, తనకూ అభిప్రాయం చెప్పే హక్కు ఉందని, కాంగ్రెసులో ఎక్కువ మంది అనుకుంటున్నదే తాను చెప్పానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అర్థం చేసుకుంటే.. తాను వాడిన మాటలు తప్పుకావొచ్చుగాక.. కానీ, దాని వెనక నా అభిప్రాయం మాత్రం తప్పు కాదన్నారు.
ఒక తప్పు విషయాన్ని గురించి గళమెత్తినందుకు అందరూ తననెందుకు తప్పుపడుతున్నారో అర్థం కావట్లేదని, తానేమైనా తప్పు చేశానా అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు గుజరాత్‌లో పార్టీని సన్నద్ధం చేసే చర్యల్లో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అహ్మదాబాద్ చేరుకున్నారు.
మహాత్మా గాంధీ స్థాపించిన సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. దాదాపు అరగంటసేపు అక్కడ గడిపిన రాహుల్ తాను బాపూజీని, ఆయన ఆలోచనలను పాటించేవాడినని, ఎప్పటికీ ఈ ఆశ్రమానికి రావడాన్ని ఓ గౌరవంగా భావిస్తానని సందర్శకుల పుస్తకంలో రాశారు.
కాగా నేర ప్రజాప్రతినిధుల ఆర్డినెన్స్ ఇక ముగిసిపోయిన అధ్యాయమని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ విషయంలో రాహుల్ తన అభిప్రాయాన్ని గట్టిగా, నాటకీయంగా, నిశ్చయంగా చెప్పారని, ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకుందని ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ అన్నారు.












Click it and Unblock the Notifications