Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వ్యక్తిగతం మాట్లాడను: యాంకర్ అమృతాతో ఎఫైర్‌పై డిగ్గీ

విజయవాడ: ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్ విషయం తన వ్యక్తిగతమని, దీనిపై స్పందించనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం చెప్పారు. ఆయన కృష్ణా జిల్లా విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అమృతా రాయ్ అంశంపై ఆయన పైవిధంగా స్పందించారు.

కాగా, ప్రముఖ టీవీ జర్నలిస్ట్ అమృతా రాయ్‌తో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంబంధం ఇటీవల సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె గురువారం... తన ఈ మెయిల్ హ్యాక్ అయిందని, తాను డిగ్గీతో కలిసి ఉన్న ఫోటోను ఎవరో దొంగిలించారని ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె గురువారం పోలీసులకు హ్యాకింగ్ విషయమై ఫిర్యాదు చేసింది.

అమృతా రాయ్ గురువారం తన జీ మెయిల్, ఫెస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఫిర్యాదు చేసిందని, క్రైం బ్రాంచ్ ఐటి యాక్ట్ కింద్ కేసును నమోదు చేశారని ఢిల్లీ క్రై బ్రాంచ్ పోలీసు అధికారులు చెప్పారు. కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా తనను అవమానిస్తున్నారని అమృతా రాయ్ ఆరోపించారు.

 My personal: Digvijay Singh

తన వ్యక్తిగత ఈమెయిల్‌ను హ్యాకింగ్ చేసి.. దానిలోని తన వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేస్తున్నారని ఆమె పోలీసులకు వివరించారు.

రెండు రోజులుగా దిగ్విజయ్ సింగ్, అమృతా రాయ్‌ల అఫైర్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. డిగ్గీ, అమృతల సంబంధంపై డిగ్గీ కుమారుడు, కాంగ్రెసు శాసనసభ్యుడు జయవర్ధన్ సింగ్ గురువారం స్పందించారు. అది వ్యక్తిగతమని, తాను తండ్రికి మద్దతు ఇస్తానని ఆయన గురువారంనాడు అన్నారు. అది పూర్తిగా వ్యక్తిగతమని, ఆ విషయంపై తాను మాట్లాడడానికి ఇష్టపడబోనని ఆయన పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. అయితే, తాను తన తండ్రికి పూర్తి మద్దతు ఇస్తానని మాత్రం చెప్పదలుచుకున్నానని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+