వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా బాబు కిడ్నీలు పాడయ్యాయి, మీ సాయం అతనికి ప్రాణం పోస్తుంది

Google Oneindia TeluguNews

ఒక బిడ్డ పుట్టినప్పుడు కేవలం బిడ్డ మాత్రమే పుట్టదు. మొత్తం ముగ్గురు పుడతారు. ఒకరు అప్పుడే పుట్టినవారు అయితే ఇంకో ఇద్దరు తల్లిదండ్రులుగా కొత్త అనుభవంలోకి అడుగుపెట్టేవారు. తొమ్మిదేళ్ళ క్రితం నా కొడుకు వేదాంత్ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాక మా జీవితం ఎన్నో సంతోషాలతో నిండిపోయింది. స్కూలు, సెలవుల మధ్య ఏళ్ళు వేగంగా గడిచిపోయాయి. మాది ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవించే చిన్న కుటుంబం. చిన్ననాటి నుంచే వేదాంత్‌కు కార్లంటే పిచ్చి.

తన బొమ్మ కార్లతో ఇల్లంతా పరిగెత్తేవాడు. పెద్దయ్యాక రేసు డ్రయివర్‌ని అవ్వాలనుకుంటున్నానని ఎప్పుడూ చెప్పేవాడు. హాస్పిటల్లో వాడిని చూడటానికి వచ్చేవారందరూ వాడికి బొమ్మ కారు తెచ్చిస్తున్నారు. వేదాంత్ కిడ్నీలు పాడయ్యాయి. చాలా ఖరీదైన డయాలసిస్ సాయంతోనే వాడు బతికున్నాడు. కానీ డయాలసిస్, మందులు కూడా అతన్ని ఎక్కువకాలం బ్రతికించలేవు. శాశ్వతంగా ఇది నయవ్వాలంటే వాడిని కిడ్నీ మార్పిడి అవసరం. దానికి రూ.10 లక్షలు ($14,550) ఖర్చవుతాయి.

My sons kidneys have failed and I have very little time left to save him

నా పేరు సందీప్ సఖ్లే, నేను వేదాంత్ తండ్రిని. నేను స్కూల్లో ప్యూనుగా నెలకి కేవలం 20,000 రూపాయల జీతానికి పనిచేస్తాను.నేను ,మా కుటుంబం అప్పుడే మా సొంత ఊరునుంచి తిరిగొచ్చాం. సడెన్ గా మా బాబు మూత్రానికి వెళ్తుంటే నొప్పిగా ఉందని చెప్పాడు. మేము అది యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకొని జనరల్ ఫిజిషియన్ దగ్గర చూపించాం. కానీ ఆ రాత్రే బాబు పరిస్థితి తీవ్రమై, రక్తపు వాంతులు చేసుకోవటం మొదలుపెట్టాడు. మేము హాస్పిటల్ కి వెళ్ళే సమయానికి వాడి శరీరంలో ఆక్సిజల్ స్థాయి చాలా తగ్గిపోయి, బిపి 190ఎంఎంహెచ్ జి అంత ఎక్కువగా పెరిగిపోయింది.

My sons kidneys have failed and I have very little time left to save him

డాక్టర్లు కొన్ని పరీక్షలు చేశారు. ఫలితాలలో మా బాబు తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నాడని బయటపడింది. వాడి స్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇది జరిగి ఒక నెల రోజులు అయింది. అప్పటి నుంచి ప్రతిరోజు వ్యాధి తీవ్రత, ప్రాణానికి ముప్పు పెరుగుతూనే ఉంది. ఈ వ్యాధి బయటపడేముందు వరకు వాడు ఉత్సాహంగా ఇల్లంతా వాళ్ళ అమ్మని తన అల్లరితో పరుగులు పెట్టించేవాడు. ఇప్పుడు మేము కేవలం వాడి నీళ్ళు నిండిన కళ్ళు, చేతులనిండా సూదిపోట్లు, చిరునవ్వు లేని ముఖమే చూస్తున్నాం.

My sons kidneys have failed and I have very little time left to save him

నా భార్య మా బాబును కాపాడటానికి తన కిడ్నీని ఇస్తోంది. అంటే ఖరీదైన డయాలిసిస్ తనకి కూడా అవసరం. మేమిద్దరం వేదాంత్‌ని కోల్పోవడానికి సిద్ధంగా లేము. అందుకే వాడిని కాపాడటానికి చేయగలిగినదంతా చేస్తున్నాం. కానీ మేం తల్లకిందులు చేసినా కూడా ఇంత తక్కువ సమయంలో అంత డబ్బు సమకూర్చలేం. మా వేదాంత్ తిరిగి నవ్వేలా మీరందరూ ఉదారంగా డొనేట్ చేసి సాయపడాలని కోరుకుంటున్నాను.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X