నా భార్యకు ఏడుగురు భర్తలు: కాపాడండి సార్

బెంగళూరు: నా భార్యకు తాను కాక మరో ఏడుగురు భర్తలు ఉన్నారని ఓ అభాగ్యుడు బెంగళూరు పోలీసులను ఆశ్రయించాడు. నా భార్య తనను నిత్యం కొడుతోందని, చిత్రహింసలకు గురి చేస్తుందని ఇమ్రాన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బెంగళూరు నగరంలోని కేజీ హళ్ళిలో ఇమ్రాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య యాస్మిన్ బాను. వివాహం అయిన తరువాత కొంత కాలం ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు.

తరువాత యాస్మిన్ బాను అసలు స్వరూపం బయటపడింది. యాస్మిన్ మగవాళ్లతో తిరుగుతుందని ఇమ్రాన్ గుర్తించాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని భార్యను ప్రశించడంతో యాస్మిన్ బాను భర్తను చితకబాదడం మొదలు పెట్టింది.

భార్య కొట్టే దెబ్బలు తట్టుకోలేక, ఆమె చిత్రహింసలు సహించలేక ఇమ్రాన్ కేజీ హళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యాస్మిన్ బాను తమను పెళ్లి చేసుకుని మోసం చేసిందని రియల్ ఎస్టేట్ ఏజెంట్ అఫ్జల్, నన్ను పెళ్లి చేసుకుందని షోయబ్ అనే ఇద్దరు కేజీ హళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

My wife has married 7 others, man tells Bengaluru cops

యాస్మిన్ తనను భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని బెదిరించిందని, డబ్బు ఇవ్వనందుకు ఆమె నన్ను వదిలి వెళ్లిపోయిందని అఫ్జల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భర్తగా ఉన్నా ఇమ్రాన్ పై దాడి చేసిందని యాస్మిన్ బాను మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

8 మంది మగవాళ్లను మోసం చేసిందని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న యాస్మిన్ బాను మాయం అయ్యింది. ఆమె ఎంత మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+