బాలికపై రేప్, ఆ టీచర్ కామాంధుడే: 200 పేజీల చార్జ్ షీట్

బెంగళూరు: బాలిక మీద అత్యాచారం చేసిన వ్యాయామ ఉపాధ్యాయుడి మీద బెంగళూరు నగరంలోని బ్యాటరాయణపుర పోలీసులు చార్జీషీటు తయారు చేశారు. బాలిక మీద కామాంధుడు అత్యాచారం చేశాడని రుజువు అయ్యిందని పోలీసులు అన్నారు.

మైసూరు రోడ్డులోని మంజునాథ నగరలోని హోసగుడ్డదహళ్ళిలోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్న 7 సంవత్సరాల బాలిక మీద అదే స్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రామకృష్ణ (49) అనే కామాంధుడు అత్యాచారం చేశాడు.

mysore road school girl rape case, police filed 200 pages chargesheet

ఇదే సంవత్సరం జనవరి 7వ తేదిన బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో బ్యాటరాయణపుర పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను, కామాంధుడిని వైద్య పరిక్షలకు తరలించారు. వైద్య నివేదికలో బాలిక మీద అత్యాచారం జరిగిందని వెలుగు చూసింది.

పోలీసులు బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను, బాలిక స్నేహితులను, స్కూల్ టీచర్ లను విచారణ చేశారు. సుమారు 200 పేజీల చార్జ్ షీట్ తయారు చేసి న్యాయస్థానంలో సమర్పించామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. కామాంధుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+