దారుణ ఘటన: భారత సైనికుడి తలతో పాక్ ఉగ్రవాది?

గురువారం ప్రసారమైన మీడియాల కథనం ప్రకారం.. తలను పట్టుకున్న ఆ వ్యక్తి పాకిస్థాన్ ఉగ్రవాది అని, అతను పాకిస్థాన్ దేశంలో హేమరాజ్ తలను ప్రదర్శిస్తున్నాడని పేర్కొన్నాయి. అంతేగాక హేమారాజ్‌కు చెందిన టార్చ్ బ్యాటరీలు, భారత కరెన్సీని ఆ ఉగ్రవాది చూపుతున్నట్లు తెలిపాయి. అయితే ఈ వీడియోపై స్పందించేందుకు సైనిక ప్రధాన కార్యాలయం తిరస్కరించినట్లు పేర్కొన్నాయి.
కాగా వీడియోలో వచ్చిన సంఘటనను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీశ్ తివారీ ఖండించారు. ఈ ఘటనపై రక్షణ శాఖ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. భారత సైనికుడి తలను ఓ ట్రోఫీలా ప్రదర్శిస్తుండటం ఎంతో దిగ్ర్భాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏమాత్రం క్షమార్హం కానీ ఘటన ఇదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications