వింత జంతువు దాడిలో మరో 3గొర్రెలు మృతి: భయాందోళనలో ప్రజలు
కటక్ జిల్లా నియాళి ప్రాంతంలో వింత ఆకారం గల జంతువు ఒకటి ఇప్పటిక పదుల సంఖ్యలో గొర్రెల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.
కటక్: ఒడిశాలోని కటక్ జిల్లా నియాళి ప్రాంతంలో వింత ఆకారం గల జంతువు ఒకటి ఇప్పటిక పదుల సంఖ్యలో గొర్రెల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి మరో గొర్రె మృతి చెందడంతోపాటు మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. తాజాగా, గురువారం రాత్రి ఈ జంతువు దాడిలో భరానా గ్రామంలో మరో రెండు గొర్రెలు మృతి చెందాయి.

గొర్రెలే లక్ష్యంగా దాడి..
కాగా, ఈ అడవి జంతువు కేవలం గొర్రెలను మాత్రమే చంపుతున్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ జంతువు బారిన పడి అనేక గొర్రెలు బలవుతున్న నేపథ్యంలో తమను రక్షించాలని గ్రామస్థులు గురువారం పుల్‌నఖరా రోడ్డుపై టైర్లు కాల్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ మార్గంలో కొన్ని గంటలపాటు రవాణా స్తంభించింది. ప్రతీ రోజు గొర్రెలను చంపేస్తున్న సంఘటనలు వెనుక దాగివున్న రహాస్యాన్ని పరిష్కరించాలని, మృతి చెందిన గొర్రెల యజమానులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాపలా ఉన్నా..
సమాచారం అందుకున్న కటక్ జిల్లా అటవీ అధికారి, నందన్‌కానన్ జూ ఫీల్డ్ డైరెక్టర్, పోలీసులు.. గొర్రె మృతి చెందిన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రాత్రిపూట గ్రామస్థులు, అటవీశాఖ సిబ్బంది గ్రామంలో కాపలా ఉన్నా బుధవారం రాత్రి మరో గొర్రెను జంతువు చంపేయడంతో ఆందోళన కలిగిస్తోంది. గురువారం రాత్రి కూడా మరో రెండు గొర్రెలు హతమవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

హెచ్చరికలు..
జిల్లా అధికారులు కూడా రాత్రిపూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లౌడ్‌స్పీకర్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ మంత్రి బిజయ్‌శ్రీ రౌత్రాయ్ గురువారం మీడియాతో మాట్లాడారు.దాడులకు పాల్పడుతున్న జంతువును పట్టుకునేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

హైనా దాడులేనా..
గొర్రెల మృతికి పరిహారం చెల్లించేందుకు ఎలాంటి విధానాలు లేవని, అటవీశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చించి పరిహారం చెల్లించే విషయమై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బిజయశ్రీ తెలిపారు. కాగా, ఈ దాడులు చేస్తున్నది అడవి జంతువు హైనా(దుమ్ములగొండి)నేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.కాగా, దాడులు జరిగిన పరిసర ప్రాంతంలో గురువారం రాత్రి ఓ హైనా సంచరిస్తున్న వీడియో వెలువడటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications