కార్పొరేటర్ కుమార్తె, టెక్కీ భార్య, నవవధువు ఆత్మహత్య, డెత్‌నోట్, ఒక్కపూట భోజనం !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: అత్త వేధింపులు తట్టుకోలేక కార్పొరేటర్ కుమార్తె, నవవధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. మైసూరు నగరం కార్పొరేటర్ నాగభూషణ్ కుమార్తె వనితా (27) ఆత్మహత్య చేసుకుందని బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు తెలిపారు.

వైభంగా పెళ్లి, కట్నం !

వైభంగా పెళ్లి, కట్నం !

మైసూరు కార్పొరేటర్ నాగభూషణ్ కుమార్తె వినితా, తమిళనాడుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు వసంత్ అనే వ్యక్తి వివాహం 7 నెలల క్రితం రంగరంగవైభంగా చేశారు. పెళ్లి సమయంలో వనితా కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో కట్నం, బంగారు నగలు వసంత్ కు ఇచ్చారని సమాచారం.

 అత్త టార్చర్ పెట్టింది !

అత్త టార్చర్ పెట్టింది !

వనితా, వసంత్ దంపతులు బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ 25వ క్రాస్ లో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు వసంత్ తల్లి గాయిత్రీ నివాసం ఉంటున్నది. పెళ్లి జరిగినప్పటి నుంచి గాయిత్రీ అదనపు వరకట్నం తీసుకురావాలని కోడలు వనితాను వేధింపులకు గురి చేసిందని సమాచారం.

ఓపిక లేక ఆత్మహత్య

ఓపిక లేక ఆత్మహత్య

అత్తవేధింపులు తట్టుకోలేని వనితా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఇంటిలో ఉరి వేసుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి పొద్దుయిన తరువాత వనితా భర్త వసంత్ ఇంటికి వచ్చిన తరువాత విషయం వెలుగు చూసింది.

నాలుగు పేజీల డెత్ నోట్ !

నాలుగు పేజీల డెత్ నోట్ !

వనితా ఆత్మహత్య చేసుకుందని సమాచారం తెలుసుకున్న హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. వనితా ఆత్మహత్య చేసుకునే ముందు నాలుగు పేజీల డెత్ నోట్ రాసి పెట్టిందని పోలీసులు చెప్పారు.

ఒక్క పూట భోజనం

ఒక్క పూట భోజనం

పెళ్లి అయిన దగ్గర నుంచి అత్త గాయిత్రీ ప్రతిరోజూ తనను పుట్టింటి నుంచి అదనపుకట్నం తీసుకురావాలని వేధింపులకు గురి చేసింది. రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం పెడుతోందని, తనకు నరకం చూపించిందని, ఇక తనకు ఓపిక లేదని డెత్ నోట్ లో వివరించిందని పోలీసులు అన్నారు. వనిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమె భర్త వసంత్, గాయిత్రీని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని శనివారం పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mysuru city Corporator daughter commit suicide in Bengaluru in Karnataka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి