టాటా రేసులో తెరపైకి మరో ఇద్దరు: చంద్రశేఖరన్‌పై డైలమా వెనుక..
ముంబై: టాటా సన్స్ చైర్మన్ పదవి రేసులో మరో ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. సైరస్ మిస్త్రీని తొలగించిన అనంతరం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మొన్నటి దాకా ఇంద్రానూయి, అరుణ్ సైరిన్, నోయల్ టాటాల పేర్లు వినిపించాయి. ఆ తర్వాత ఎస్ రామదొరై పేరు వినిపించింది.
తాజాగా, మరో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్, జాగ్వార్ లాండ్ రోవర్ అధినేత రాల్ఫ్ స్పెత్ పేర్లు వినిపిస్తున్నాయి. కొత్త చైర్మన్ ఎంపికకు నాలుగు నెలల సమయం తీసుకున్నారు. రతన్ టాటా తాత్కాలిక చైర్మన్‌గా ఉన్నారు.

ఆయన నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనుంది. మరీ ముఖ్యంగా, ఇప్పుడు చంద్రశేఖరన్ పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ఆయన ఎంపిక మాత్రం కొంత సంక్లిష్టంగా ఉండే అవకాశముందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
టాటా గ్రూప్‌లోని విలువైన కంపెనీలకు ఆయన హెడ్‌గా ఉన్నారు. కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను టాటా ఛైర్మన్‌గా ఎంపిక చేస్తే ఆ స్థానాన్ని భర్తీ చేయగల మరొకరిని అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సంస్థ ప్రయోజనాల దృష్ట్యా అంతిమంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశముంటుందంటున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications