భర్తకు షాక్.. తెళ్లారి లేచే సరికి భార్య ప్లేస్ లో పాము కుబుసం.. ఏం జరిగింది..?

పాత సినిమాల్లో నాగిని క్యారెక్టర్ చాలా ఫేమస్.. ఓ మహిళ సడెన్ గా పాములా మారిపోవడం.. మళ్లీ మహిళగా మారిపోవడం మనం చూస్తుంటాం.. సరిగ్గా అలాంటి సీన్ తాజాగా రిపీట్ అయింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి నుంచి తప్పించుకునేందుకు ఓ యువతి పెద్ద ప్లానే వేసింది. తాను నాగినిగా మారిపోయినట్లు నమ్మించేందుకు ఎవరూ కలలో కూడా ఆలోచించని విధంగా షాకింగ్ ఘటనకు పాల్పడింది. ఆమె చేసిన పనికి కాబోయే భర్త ఫ్యూజులు అవుట్ అయ్యాయి.

ప్రజలపై సినిమాల ప్రభావం ఎప్పటికీ ఉంటుంది. ఇప్పటి జనరేషన్ కూడా వీటిని ఫాలో అవుతున్నారు. కానీ ఎట్టకేలకు దొరికిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. మన దేవుళ్లు, సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలను అడ్డం పెట్టుకుని ఓ యువతి ఎవరూ చేయని సాహసం చేసింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తాను నాగినిగా మారిపోయాయని నమ్మించేందుకు ఏకంగా తన బెడ్ పై పాము కుబుసం ఉంచి పరార్ అయింది. తన బాయ్ ఫ్రెండ్ తో జంప్ అయింది.

ఈ ఘటనపై అనుమానం వచ్చిన పెద్దలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా అసలు విషయం బయట పడింది. 24ఏళ్ల రీనా.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమాయణం నడిపింది. అలా ఇద్దరూ లవ్ చేసుకున్నారు. కానీ రీనాకు పెద్దలు వేరే సంబంధం తీసుకొచ్చారు. ఆ సంబంధం ఇష్టంలేని రీనా.. ఎలాగైనా తన ప్రియుడితో లేచిపోవాలని ఫిక్స్ అయింది.

Naagin Drama in uttar pradesh Woman Leaves Snake Skin on Bed Elopes with Lover to Dodge Marriage

దాంతో ఎవరికీ అనుమానం రాకుండా నాగిని స్కెచ్ వేసింది. తన బెడ్ పై నాగుపాము కుబుసం ఉంచింది. తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది. రీనా పేరెంట్స్ బెడ్ పైన పాము కుబుసం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే రీనా.. తన నాగిని ప్లాన్ ను మూడు నెలల ముందుగానే అమలు చేస్తూ వస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తన కలలోకి పాములు వస్తున్నాయని రీనా తన పేరెంట్స్ కు తరచూ చెప్తూ వచ్చింది. అలా వారిని నమ్మిస్తూ వచ్చింది. కానీ పోలీసుల విచారణలో ఎట్టకేలకు బయటపడింది. ప్రస్తుతం లేచిపోయిన ఆ జంటను వెతికే పనిలో పోలీసులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+