వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral:కళ్లు చిన్నగా ఉంటే ఉపయోగాలెన్నో.. నాగాలాండ్ మంత్రి కామెంట్స్.. వైరల్

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పుడు నేతలు కూడా కామెంట్స్ చేస్తుంటారు. అయితే అవయవాల గురించి/ వాటి వల్ల ఉపయోగం గురించి చేయడం రేర్.. నాగాలాండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి, ట్రైబల్ వ్యవహారాల మంత్రి టెమ్జెన్ ఇమ్నా ఇలా కామెంట్ చేశారు. కళ్లు చిన్నగా ఉండటం గురించి మాట్లాడారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

ఈశాన్య ప్రజలకు చిన్న కళ్లు ఉంటాయి. కానీ వారికి దృష్టి స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. అలాగే కళ్లు చిన్నగా ఉండటంతో దుమ్ము, ధూళి పోదని చెప్పారు. అలాగే సుధీర్ఘ కార్యక్రమం జరుగుతున్న సమయంలో కూడా సులభంగా పడుకోవచ్చునని తెలిపారు. అలాగే వేడుక జరిగే సమయంలో వేదికపై నిద్రపోతాం.. అని అలాగే రాత్రి కూడా అంతే సుఖంగా పడుతుందని చెప్పారు.

Nagaland minister said advantages of having small eyes

నాగాలాండ్‌లో నేషనల్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ అలయన్స్ అధికారంలో ఉంది. నిపియు రియో సీఎంగా ఉన్నారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. అతని కామెంట్స్ విమర్శలకు దారితీసింది. ఇదీ కచ్చితంగా జాత్యాంహకార కామెంట్స్ అని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో జనం అలానే ఉంటారని.. వారి అవతారం అలానే ఉంటుందని అంటున్నారు. మంత్రి హోదాలో ఉండి ఇలా కామెంట్ చేయడం సరికాదని అంటున్నారు.

కానీ అతని కామెంట్ చేసిన వీడియో మాత్రం వైరల్ అవుతుంది. అవునా కళ్లు చిన్నగా ఉంటే ఇలా జరుుతాయా అని అందరూ అంటున్నారు. నిజమేనా..? సాంకేతికంగా రుజువు ఉందా అని అడుగుతున్నారు. కానీ విపక్షాలు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదీ సరికాదని.. ఇక్కడి జనాలను అవమానించడమే అని అంటున్నాయి.

English summary
Nagaland Higher Education and Tribal Affairs Minister Temjen Imna Along speech on 'advantages of having small eyes' has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X